
జనం న్యూస్ 01 జూలై 2026 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్ జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని గద్వాల్ ఆర్టీసీ డిపోలో ఆలంపూర్ నియోజకవర్గ శాసనసభ్యులు విజయుడు డిపో మేనేజర్ శ్రీధర్‌తో సమావేశమై డిపో నిర్వహణ, ప్రయాణికులకు అందుతున్న రవాణా సేవలు బస్సుల నిర్వహణ స్థానిక సమస్యలు మరియు వాటి పరిష్కారంపై సమగ్రంగా చర్చించారుఆలంపూర్ నియోజకవర్గ ప్రజలకు మెరుగైన సకాలంలో రవాణా సేవలు అందేలా చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే అధికారులకు సూచించారు. ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులను వెంటనే పరిష్కరించి ప్రయాణికులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ప్రత్యేక చర్యలు చేపట్టాలని డిపో మేనేజర్ శ్రీధర్‌కు సూచించారు ప్రజా సమస్యల పరిష్కారమే తన ప్రాధాన్యమని రవాణా సేవల మెరుగుదలకు అవసరమైన అన్ని చర్యలకు తన పూర్తి సహకారం ఉంటుందని ఎమ్మెల్యే విజయుడు పేర్కొన్నారు.