
జనం న్యూస్ జూన్ 29 తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి గొట్టిముక్కల పద్మారావు మృతి పట్ల తెలంగాణ ప్రభుత్వ చీఫ్ విప్, ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. సోమవారం పద్మారావు నివాసానికి వెళ్లిన ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా పద్మారావు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పిస్తూ, ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.పద్మారావు సమాజ సేవలో చూపిన నిబద్ధత, ప్రజలతో ఆయనకు ఉన్న అనుబంధం చిరస్మరణీయమని పట్నం మహేందర్ రెడ్డి పేర్కొన్నారు. ఈ విషాద సమయంలో కుటుంబ సభ్యులు ధైర్యంగా ఉండాలని, వారికి పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.ఈ కార్యక్రమంలో కూకట్పల్లి నియోజకవర్గ కాంగ్రెస్ అధ్యక్షుడు శేరి సతీష్ రెడ్డి, డివిజన్ అధ్యక్షుడు కృష్ణ రాజ్పుత్, తమ్మినేని ప్రవీణ్ కుమార్, కూకట్పల్లి నియోజకవర్గ క్రిస్టియన్ మైనార్టీ కోఆర్డినేటర్ మేకల మైఖేల్, ఏఎంసీ డైరెక్టర్ ఫణీంద్ర కుమార్, మైనారిటీ సెల్ సీనియర్ నాయకుడు మగ్దుం భాయ్, యూత్ కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు కోలికోట శంకర్, యూత్ నాయకులు హర్షవర్ధన్, కళ్యాణ్ బాబు, దుర్గాప్రసాద్, భార్గవ్ రెడ్డి, రామకృష్ణారెడ్డి, మల్లి బాబు, కొమ్ము బాబురావు, సూరిబాబు, మహిళా నాయకురాళ్లు దార్ల వనజ, స్వప్న రెడ్డి, కోమలి, దీప్తితో పాటు పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొని గొట్టిముక్కల పద్మారావుకు ఘనంగా నివాళులర్పించారు.