
జనం న్యూస్ మే 23 అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ ఐదు సంవత్సరాలు ప్రజాధనాన్ని దోచుకొని రాష్ట్రాన్ని నట్టేట ముంచి, మూడు రాజధానులు పేరుతో మూడుముక్కలాట ఆడి, ప్రజలు నీ మాయ మాటలు గ్రహించి 11 సీట్లు ఇచ్చి ఇంటికి పంపించిన, నేడు నెలకు ఒకసారి బెంగళూరు నుంచి వచ్చి పిచ్చి కూతలు కూస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పేరు ఉచ్చరించడానికి అర్హత లేని నీకు అమరావతి గురించి మాట్లాడే నైతిక హక్కు కూడా లేదని, మావిగాన్ పేరు చెప్తే చంద్రబాబు గుండె ఆగి పోతుందని, అమరావతి అభివృద్ధి పనులతో పరుగులు తీస్తున్న వైనం చూసి ఓర్వలేని తనంతో అహంభావంతో సంధి పేలాపన పేలుతున్న జగన్ రెడ్డి కారు కూతలు మానుకోవాలని మాజీ ఎమ్మెల్సీ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి బుద్ధ నాగ జగదీశ్వరరావు జగన్ రెడ్డికి హితువు పలికారు. ప్రజలు తిరస్కరించిన, మీ పార్టీని మూలకు కూర్చోబెట్టి రెండు సంవత్సరాలు అవుతున్న ఓటమికి కారణాలపై ప్రజలను నిందిస్తున్నాడని, జగన్ రెడ్డి నువ్వు మంచివాడు అయితే ప్రజలు నీకు 11 సీట్లకే ఎందుకు పరిమితం చేసారో సెలవిస్తారా అని జగన్ రెడ్డిని నాగ జగదీష్ ప్రశ్నించారు. జగన్ రెడ్డి కుటుంబంలో హత్యా రాజకీయాల గురించి 40 సంవత్సరాలుగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రజలు గమనిస్తూనే ఉన్నారని, రాజశేఖర్ రెడ్డి హెలికాప్టర్ ప్రమాదంలో చనిపోతే, దానికి చంద్రబాబు నాయుడు పై ఆపాదించడం, ముకేశ్ అంబానీ రాజశేఖర్ రెడ్డి హత్యకు కుట్ర పన్నారని ఉద్దేశంతో రాష్ట్ర వ్యాప్తంగా ఆనాడు రిలయన్స్ బంక్ లపై దాడులు చేయించింది నువ్వు కాదా, నువ్వు అధికారంలోకి వచ్చిన తర్వాత అదే రిలయన్స్ కంపెనీకి సంబంధించిన వ్యక్తి పరిమళ నత్వాని కి రాజ్యసభ సభ్యులుగా పంపించిన విషయం సభ్య సమాజం నీ నీతిమాల చర్యలను ఆనాడే ఖండించారని, అయినప్పటికీ నీ రోత పత్రికల్లో వార్తలు వండి వార్చుతున్న వైనాన్ని ప్రజలు చిత్కరిస్తున్న నీలో పరివర్తన రాలేదని నాగ జగదీష్ అన్నారు. నాడు అమరావతి, పోలవరం ప్రాజెక్టుని ఏటీఎం లాగా వాడుకుంటున్నారని తూట్లు పొడిచి, నేడు అక్కడ జరుగుతున్న అభివృద్ధిని చూసి, నీ కళ్ళు బైర్లు కమ్మే, లేనిపోని ప్రేక్ ప్రచారాలు చేస్తున్నారని, అమరావతిలో పనులకు ఎస్టిమేట్లు పెంచేసి, ఎక్కడో లేని రేట్లు వేసి దోచుకుంటున్నారని జగన్ రెడ్డి మాటలకు అతను పరిజ్ఞానానికి నిదర్శనమని, టెండర్ షెడ్యూల్ పై అవగాహన లేక, ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఏది ఏమైనా అమరావతి ప్రజలు ఆమోదంతో తీర్పు ఇచ్చారని దానికి అనుకూలంగా కేంద్రం పార్లమెంట్ లో 40 పార్టీలు అనుకూలంగా ఆమోదం తెలిపి చట్టబద్ధత అమరావతికి కల్పించిన విషయం జగన్ రెడ్డి మర్చిపోతున్నారని నాగ జగదీష్ అన్నారు. సొంత చిన్నాన్న వివేకానంద రెడ్డి హత్య జరిగిన విషయం ప్రపంచం తెల్లవారకముందే తెలిసిన ఒకే ఒక వ్యక్తి జగన్ రెడ్డిని గొడ్డలి తో హత్య చెయ్యమని ఆదేశించిన వ్యక్తి జగన్ రెడ్డి అని దస్తగిరి స్పష్టంగా చట్టం ముందు తెలియజేసారని, గొడ్డల పార్టీకి బ్రాండ్ అంబాసిడర్ జగన్ రెడ్డి నని నాగ జగదీష్ అన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీ భోగలింగేశ్వర స్వామి దేవస్థానం చైర్మన్ కాండ్రేగుల సత్యనారాయణ బాలకృష్ణ ఫ్యాన్స్ గౌరవ అధ్యక్షులు పొలిమేర నాయుడు తదితరులు పాల్గొన్నారు.//