
జనం న్యూస్ జూలై 29 అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ : గురుపౌర్ణమి సందర్భంగా 84 వ వార్డు గొల్ల వీధిలో శ్రీకృష్ణ దేవాలయంలో గురు పౌర్ణమి వేడుకలు బోడి వెంకట్రావు ఆధ్వర్యంలో జరుగుతున్న కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్సీ బుద్ధ నాగ జగదీశ్వరరావు పాల్గొని సాయిబాబాని దర్శించుకుని ప్రసాదం స్వీకరించిన అనంతరం వెంకటరావు నాగ జగదీష్ కు శాలువతో సత్కరించారు. అక్కడ వేంచేసి ఉన్న భక్తులు ఉద్దేశించి నాగ జగదీష్ మాట్లాడుతూ ఆషాడ శుద్ధ పౌర్ణమిని గురు పౌర్ణమి లేదా వ్యాస పౌర్ణమి అంటారని, ఈ పవిత్ర రోజున మనకు జ్ఞానాన్ని అందించిన గురువులను, ఉపాధ్యాయులను ప్రత్యేకంగా పూజిస్తారని, ఇది వేదవ్యాసుని జన్మదినం. పరమశివుడు సప్త ఋషులకు మొదటిసారి యోగ జ్ఞానాన్ని బోధించిన రోజు ఇదేనని నమ్ముతారని నాగ జగదీష్ అన్నారు. అనంతరం భక్తులకు అన్న సమారాధన మాజీ ఎమ్మెల్సీ నాగ జగదీష్ చేతుల మీదుగా పంపిణీ కార్యక్రమం చేశారు. ఈ కార్యక్రమంలో కుప్పిలి జగన్ బొబ్బిలి గోవిందరాజు నమ్మి రామారావు నమ్మి దేవుడమ్మ బోడి ఉమా తదితరులు పాల్గొన్నారు.//