
జనం న్యూస్ జూన్ 04. 06. 2026 సంగారెడ్డి జిల్లా ఇన్చార్జ్ బి వీరేశం జహీరాబాద్ నియోజకవర్గంలోని గ్రామపంచాయతీలకు పెండింగ్లో ఉన్న నిధులను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని ప్రజలు, ప్రజాప్రతినిధులు డిమాండ్ చేస్తున్నారు. నిధుల కొరత కారణంగా గ్రామాల్లో పారిశుద్ధ్య నిర్వహణ, తాగునీటి సరఫరా, వీధి దీపాల నిర్వహణ, డ్రైనేజీ మరమ్మతులు, అంతర్గత రహదారుల అభివృద్ధి వంటి కీలక పనులు నిలిచిపోయాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గ్రామపంచాయతీలకు రావాల్సిన నిధులు ఆలస్యమవడంతో సర్పంచ్లు, గ్రామస్థాయి సిబ్బంది తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. గ్రామాల అభివృద్ధి వేగవంతం కావాలంటే పెండింగ్ నిధులను తక్షణమే విడుదల చేసి స్థానిక సంస్థలను ఆర్థికంగా బలోపేతం చేయాలని ప్రజలు కోరుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా గ్రామపంచాయతీల అభివృద్ధి కోసం కేంద్ర, రాష్ట్ర స్థాయిలో నిధుల విడుదల కొనసాగుతున్న నేపథ్యంలో మిగిలిన పెండింగ్ నిధులను కూడా ఆలస్యం చేయకుండా విడుదల చేయాలని ప్రజలు ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నారు.