
అచ్యుతాపురం నుంచి ఎలమంచిలి వరకు భారీ బైక్ ర్యాలీ..
జనం న్యూస్, సెప్టెంబర్ 02, అచ్యుతాపురం : ఏపీ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత కొణిదెల పవన్ కళ్యాణ్ జన్మదినాన్ని పురస్కరించుకుని ఎలమంచిలి నియోజకవర్గంలో జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. స్థానిక ఎమ్మెల్యే సుందరపు విజయ్‌కుమార్ ఆధ్వర్యంలో అచ్యుతాపురం నుంచి ఎలమంచిలి వరకు భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ బైక్ ర్యాలీలో ఎలమంచిలి నియోజకవర్గంలోని నాలుగు మండలాలకు చెందిన జనసైనికులు, నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.ర్యాలీ అనంతరం గుర్రప్ప కల్యాణ మండపంలో నిర్వహించిన కార్యక్రమంలో ఎలమంచిలి నియోజకవర్గ ఎమ్మెల్యే సుందరపు విజయ్‌కుమార్,జనసైనికులు కలిసి పవన్ కళ్యాణ్ జన్మదిన శుభాకాంక్షలు తెలిపి కేక్‌ను కట్ చేశారు.ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ యువజన విభాగం నూతన లోగోతో పాటు ప్రత్యేక గీతాన్ని కూడా పరిచయం చేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే సుందరపు విజయ్‌కుమార్ మాట్లాడుతూ.. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జన్మదినం సందర్భంగా ఎన్డీఏ ప్రభుత్వం అనకాపల్లి జిల్లాకు గోదావరి జలాలను అందించడం ఎంతో సంతోషకర మైన విషయమన్నారు. గోదావరి జలాలు జిల్లాకు రావడంతో పండగ వాతావరణం నెలకొందని గోదావరి జలాలు అనకాపల్లి జిల్లాకు రావడం శుభపరిణామమని ఎమ్మెల్యే పేర్కొన్నారు. అభివృద్ధి, సంపద సృష్టి ఎన్డీఏ ప్రభుత్వంతోనే సాధ్యమవు తుందని అన్నారు. పవన్ కళ్యాణ్ సహకారంతో ఎలమంచిలి నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తున్నామని నియోజకవర్గాన్ని సుమారు రూ.1,500 కోట్లతో అభివృద్ధి చేస్తున్నామని వెల్లడించారు.కూటమి ప్రభుత్వం ప్రజల సంక్షేమం, అభివృద్ధికి అధిక ప్రాధాన్యత ఇస్తోందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వీర మహిళలు జనసైనికులు తదితరులు పాల్గొన్నారు.