
జనం న్యూస్ నందలూరు కడప జిల్లా 05-06-26 నాగిరెడ్డిపల్లి మారెమ్మ జాతర సందర్బంగా మొదటి రోజు మారెమ్మ తల్లి కి 101 టెంకాయల తో మరియు 101 బిందెల నీళ్లు తో మారెమ్మ తల్లికి అభిషేకం చేయడం జరిగింది అలాగే సత్తెమ్మ స్వామికి గంగమ్మ తల్లి కు అభిషేకం చేయడం జరిగింది.అదేవిదంగా మధ్యాహ్నం అన్న ప్రసాదం జరిగింది ఈ కార్యక్రమం లో భక్తులు విరివిగా పాల్గొన్నారు అదేవిదంగా రేపు అనగా రెండవ రోజు ఉదయం మారెమ్మ కు పూజలు జరుగును మధ్యాహ్నం 12 గంటలకు అన్నదాన కార్యక్రమం ఉంటుంది. మరియు సాయంత్రం 3 గంటల నుండి అమ్మవారి ఊరేగింపు కార్యక్రమం ఉంటుంది అని గ్రామ పెద్దలు తెలియ జేశారు