
జనం న్యూస్ నందలూరుకడప జిల్లా నందలూరు మండలంలోని పాటూరు గ్రామంలో వెలసిన శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయము నందు శ్రీ మహాలక్ష్మి దేవి విగ్రహ ప్రతిష్ట ఆదివారం అత్యంత ఘనంగా జరిగింది. పండితులు బండాత్మకూరు ఆధ్వర్యంలో ఆవాహిత పూజలు, ప్రధాన వాస్తు, రక్ష, పంచసూక్త, హోమములు, గర్త పూజలు, ధ్వజ ప్రతిష్ట మహోత్సవము, మహా పూర్ణాహుతి, ప్రాణ తిష్టలు ,బంబకళాన్యాసము, గోదర్శనము, కన్యాదర్శనము, కుంభాభిషేకము, కూష్మాండబలి, మహాదా సీర్వచనం కార్యక్రమాలు భక్తిశ్రద్ధలతో జరిగాయి. మధ్యాహ్నం భక్తులకు పెద్ద ఎత్తున అన్నదానం ఏర్పాటు చేశారు. రాత్రి ఏర్పాటుచేసిన భజన భక్తులనుఅలరింపజేసింది. ఈ సందర్భంగా ఆలయ ధర్మకర్త ఎల్లమరాజు శ్రీనివాసరాజు మాట్లాడుతూ మూడు రోజులపాటు మహాలక్ష్మి దేవి విగ్రహ ప్రతిష్ట అత్యంత ఘనంగా జరిగిందని, అందుకు సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్య వాదాలు తెలియ జేశారు.