
జనం న్యూస్ నందలూరు కడప జిల్లా(ఆగస్టు 26) నందలూరు మండలంలోని పవిత్ర మిలాద్-ఉన్-నబీ పర్వదినాన్ని పురస్కరించుకొని ముస్లింసోదరులు. ఒంటిమిట్ట సిఐ వెంక టేశ్వర్లు, స్థానిక ఎస్ ఐ మల్లి కార్జున రెడ్డి ఘనంగా సన్మాన కార్యక్రమం నిర్వ హించారు, సందర్భంగా ఆయన ముస్లింసోదరులందరికీమిలాద్-ఉన్-నబీ శుభాకాంక్షలు తెలియ జేశారు .ఈసందర్భంగా ఒంటిమిట్ట. సి.ఐవెంకటేశ్వర్లు మాట్లాడుతూ ప్రపంచమానవాళికి ప్రేమ, సహనం, శాంతి, సామ
రస్యాల ను బోధించిన మహమ్మద్ ప్రవక్త చూపిన కరుణ, మానవత్వ మార్గంలో మన మందరం పయనించాలని ఆకాంక్షించారు. ఈ పర్వదినం ప్రతి ఒక్కరి జీవితంలో సుఖ సంతోషాలు,ఆనందోత్సవాలు నింపాలనికోరుకున్నారు.ఈ కార్యక్రమంలో ముస్లిం మైనార్టీ నాయకులు ఉమ్మడి కడప జిల్లా వక్స్ బోర్డ్ మాజీ అధ్యక్షులు సయ్యద్ అమీర్, మండల కోఆప్షన్స్ మెంబర్, కలీం ఉల్లాఖాన్,న్యాయవాది సెమీ ఉల్లా ఖాన్, నందలూరు రైల్వే కన్సల్టేటివ్ మెంబర్ రాచూరి మురళి, నందలూరు పీఠాధిపతి హైదర్ సాహెబ్, మహబూబ్ బాషాఖాన్, ఆర్ముగం విశ్వనాధ్. పఠాన్ మెహర్ ఖాన్,షేక్ ఇంతియాజ్ హుస్సేన్. షేక్ కరిముల్లా,షేక్ కమాల్ బాషా తదితరులు పాల్గొన్నారు.