
జనం న్యూస్ నందలూరు కడప జిల్లానందలూరు: మండలంలోని శ్రీ అన్నమాచార్య అకాడమీ ఇంగ్లీష్ మీడియం హైస్కూల్లో గురు వారం ముందస్తు కృష్ణాష్టమి వేడుకలను ఘనంగా నిర్వ హించారు. ఈ సందర్భంగా పాఠశాల విద్యార్థులు శ్రీకృష్ణుడు, గోపికల వేషధారణలో అల రించారు. ముఖ్యంగా చిన్నా రులు చిన్ని కృష్ణుడి వేష ధారణలో ముస్తాబై అందరినీ ఆకట్టుకున్నారు.కృష్ణాష్టమి పర్వదినం విశిష్టతను తెలియజేస్తూ విద్యార్థులు నిర్వహించిన ఉట్టి కార్యక్రమం, సాంస్కృతిక కార్యక్రమాలు సందడిగా సాగాయి. చిన్నారుల కృష్ణుడి వేషధారణ, వారి ముద్దుముద్దు చేష్టలు వేడుకలకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యా యులు హేమలత, బాలాంజనే యులు, సమ్మెట శివప్రసాద్, సమ్మెట ఉమామహేశ్వర్ ,పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.