
జనం న్యూస్ జూన్ 1 తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు ,కూకట్పల్లి నియోజక వర్గం, క్రిస్టియన్ మైనారిటీస్ ఫైనాన్స్ కార్పొరేషన్ కోఆర్డినేటర్, మేకల మైఖేల్ జన్మదిన కార్యక్రమాలు కూకట్పల్లి కాంగ్రెస్ పార్టీ శ్రీ హేమ దుర్గాభవన్లో జరిగాయి .ఈ కార్యక్రమంలో కూకట్పల్లి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ టీపీసీసీ ఉపాధ్యక్షుడు కమ్మ కార్పొరేషన్ చైర్మన్ బండి రమేష్ ముఖ్య అతిథిగా పాల్గొని మేకల మైకేల్ చేత కేక్ కటింగ్ చేయించి శాలువాతో సత్కరించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా బండి రమేష్ మాట్లాడుతూ కూకట్పల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నాయకులకు సముచిత గౌరవం ఉంటుందని,వారికి మంచి పదవుల లభించే లాగా తన వంతు కృషి చేస్తామని తెలిపారు కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడే కార్యకర్తలకు నాయకులకు మంచి పదవులు లభిస్తాయి అని పార్టీ కోసం ప్రతి ఒక్కరూ కష్టపడాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఈ కార్యక్రమం లో మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ లక్ష్మయ్య, గాలి బాలాజీ, కొప్పిశెట్టి దినేష్ కుమార్,పిడికిటి గోపాల్ చౌదరి, అరవింద రెడ్డి , చలసాని నలినీకాంత్, రంగమోహన్, రామారావు, బాబ్జి, తదితరులు నాయకులు పాల్గొన్నారు.