
జనం న్యూస్, మే 22, వికారాబాద్ జిల్లా పూడూరు మండలం లోని చన్గోముల్ రైతు వేదిక లో ఈరోజు రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు కార్యక్రమం లో భాగంగా అన్నదాతల అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో డా. స్వర్ణలతాదేవి ప్రధాన శాస్త్రవేత్త , వరి విభాగం, రాజేంద్రనగర్. వివిధ వరి రకాల గురించి మరియు వరిలో అధిక దిగుబడి సూచనల గురించి, పంట మార్పిడి మరియు సేంద్రీయ వ్యవసాయం గురించి వివరించడం జరిగింది. డా. సి హెచ్. అనూష శాస్త్రవేత్త ( కీటక శాస్త్రం)మొక్కజొన్న పరిశోధన విభాగం, వారు రైతులు సిఫార్సు మోతాదులో యూరియాను పంటలలో వాడాలని మరియు వివిధ ప్రధాన పంటలలో పాటించవలసిన సమగ్ర సస్యరక్షణ చర్యలను మరియు సాగు నీటిని ఎలా ఆదా చేసుకోవాలో వివరించారు.ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ అధికారులు మండల వ్యవసాయ అధికారి ఆర్. ప్రభాకర్, ఏ ఈ ఓ లు ఇలియాస్, మహిపాల్ గ్రామ పంచాయతీ కార్యదర్శి పరశురాములు, మరియు చన్గోముల్ సర్పంచ్ బి. శ్రీనివాస్ రెడ్డి , ఉప సర్పంచ్ బి.వెంకటేష్ గ, AMC డైరెక్టర్ కే. రమేష్ . Pacs డైరెక్టర్ పి. చెన్నయ్య . మరియు వివిధ గ్రామాల రైతులు పాల్గొన్నారు.