
జనం న్యూస్ నందలూరు కడప జిల్లా 20-05-26కడప జిల్లా రాజంపేట నియోజకవర్గం, నందలూరు మండలం నాగిరెడ్డిపల్లె గ్రామానికి చెందిన మాజీ ఎంపీటీసీ సభ్యులు మాడపూరి శ్రీరాములు కుమారుని నాలుగవ జన్మదిన వేడుకలు ఎంతో ఘనంగా నిర్వహించారు ఈ వేడుకలకు రాజంపేట జనసేన పార్టీ నాయకులు, మాజీ జడ్పీటీసీ సభ్యులు యల్లటూరు శివరామరాజు ముఖ్య అతిథిగా హాజరై చిన్నారిని ఆప్యాయంగా ఆశీర్వదించి జన్మదిన శుభా కాంక్షలు,తెలియజేశారు.అనంతరం చిన్నారికి బహుమతిని అందజేసి కుటుంబ సభ్యులతో ఆనందాన్ని పంచు కున్నారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ చిన్నారులు ఆనందంగా,ఆరోగ్యంగా ఎదిగి కుటుంబానికి గర్వకారణంగా నిలవాలని ఆకాంక్షించారు.ఈ కార్య క్రమంలో నాగిరెడ్డిపల్లె పంచాయతీ మాజీ సర్పంచ్ సమ్మెట శివప్రసాద్, ఆకుల చలపతి,తాటి సుబ్బ రాయుడు, సమ్మెట ఉమా మహేష్, రైల్వే రాజేష్, పులినరసింహులు, సాయి రాజు సూరి తదితరులు పాల్గొన్నారు.