
ఆపదలో ఉన్నవారికి అత్యవసర వేల బాధితులకు అండ డయల్ 112
జనం న్యూస్ సెప్టెంబర్ 5 చిలిపి చెడు మండల ప్రతినిధి మెదక్ జిల్లా చిలిపి చెడు మండలంలో ని పోలీస్ స్టేషన్ను ఆకస్మిక తనిఖీ నిర్వహించారు సైబర్ నేరాలు డ్రగ్స్ పై గ్రామస్థాయిలో విస్తృత అవగాహన అలాగే సీసీ కెమెరాలు ఏర్పాటు బీట్ వ్యవస్థను బలోపేతం చేయాలి మెదక్ జిల్లా ఎస్పీ వి శ్రీనివాసరావు తెలిపారు పోలీస్ స్టేషన్లలో సమర్థవంతమైన పోలసింగ్తో పాటు రికార్డుల నిర్వహణ పెండింగ్ కేసుల దర్యాప్తుపై ప్రత్యేక దృష్టి సాధించాలని మెదక్ జిల్లా ఎస్పీ డి వి శ్రీనివాసరావు అన్నారు వార్షిక తనిఖీల్లో భాగంగా శనివారం చిలిపి చెడు పోలీస్ స్టేషన్ను ఎస్పీ తనిఖీ చేశారు ఈ సందర్భంగా స్టేషన్ ఆవరణలో మొక్కను నాటి పోలీస్ సిబ్బంది కిట్టును పరిశీలించారు అనంతరం స్టేషన్ నిర్వహణ నేరాల దర్యాప్తు రికార్డుల నిర్వహణ సిబ్బంది పనితీరు పెండింగ్ కేసుల పురోగతిని సమీక్షించారు ఎఫ్ ఐ ఆర్ ల నమోదు స్టేషన్ డైరీలు రౌడీషీట్లు సస్పెక్ట్ సీట్లు బీట్ బుక్స్ సీజ్ ప్రాపర్టీ రికార్డులు వారెంట్ల అమలు ఈసాక్ష నమోదు తదితరు అంశాలను క్షుణ్ణంగా పరిశీలించారు పోలీస్ స్టేషన్లలో ఎలాంటి పెండెన్సి లేకుండా రికార్డులను ఎప్పటికప్పుడు నవీకరించి పకడ్బందీగా నిర్వహించాలని ఎస్పి సూచించారు బాధితులకు సత్వర న్యాయం అందేలా నాణ్యమైన పారదర్శకమైన దర్యాప్తు చేపట్టాలని ఆదేశించారు స్టేషన్కు వచ్చే ప్రజలతో మర్యాదపూర్వకంగా వ్యవహరిస్తూ వారి సమస్యలను ఓర్పుతో విని చట్టపరమైన సహాయం అందించాలని సూచించారు దుకాణాలు వ్యాపార సంస్థలు ప్రధాన కోడళ్ళ వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటును ప్రోత్సహించాలని ఎస్పీ అన్నారు విలేజ్ పోలీస్ ఆఫీసర్లు పరిధిలోని గ్రామాలపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని గ్రామస్థాయిలో పోలీసులు మరింత పటిష్టం చేయాలని సూచించారు సైబర్ నేరాలు మాదకద్రవ్యాల దుష్పరిణామాలపై ప్రతి గ్రామంలో ప్రజలకు విస్తృతంగా అవగాహన కల్పించాలని ఆదేశించారు అనంతరం పోలీస్ స్టేషన్ సిబ్బందితో ఎస్పీ సమావేశమై విధుల నిర్వహణపై పలు సూచనలు చేశారు విధినిర్వహణలో క్రమశిక్షణ అంకితభావంతో పనిచేసే ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని సూచించారు సిబ్బంది విధులకు సంబంధించిన అంశాలతో పాటు వారి వ్యక్తిగత సమస్యలను కూడా అడిగి తెలుసుకుని అవసరమైన సహకారం అందిస్తామని ఎస్పీ తెలిపారు అత్యవసర పరిస్థితుల్లో ప్రజలు ఎలాంటి ఆందోళనకు గురికాకుండా వెంటనే కు సమాచారం అందించాలని ఎస్పి సూచించారు ఆపదలో ఉన్నవారికి తక్షణ పోలీస్ సహాయం అందేలా 112 సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు ఎస్పీ వెంట డిఎస్పి నరేందర్ గౌడ్ సిఐలు సందీప్ రెడ్డి రంగా కృష్ణ ఎస్సై నర్సింలు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు