
జనం న్యూస్ నందలూరు కడప జిల్లా.నందలూరు మండలంలోని నాగిరెడ్డిపల్లె మేజర్ గ్రామ పంచాయతీ నాగిరెడ్డిపల్లి లోని జూనియర్ సివిల్ జడ్జి కోర్టుగా ఎదురుగా ఉన్న ఉమా మహేష్ చౌక దుకాణాన్ని సాయంత్రం రాజంపేట సబ్ కలెక్టర్ హెచ్ ఎస్ భావన ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె లబ్ధిదారుల తో మాట్లాడుతూ తూకాలు సక్రమంగా ఉన్నాయా,రేషన్ సక్రమంగా అందుతోందా అని అడిగి తెలుసుకున్నారు. లబ్ధిదారుల నుండి ఎలాంటి ఫిర్యాదులు అందకపోవడంతో, ధరల పట్టికలో చౌక దుకాణం లోని నిల్వలను, ప్రతి నెల వస్తువుల ధరలు బోర్డుపై నమోదు చేయాలని ఆమె సూచించారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.