
జుక్కల్ జూలై 6 జనం న్యూస్ జుక్కల్ నియోజకవర్గ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని సోమవారంమద్నూర్ మండల కేంద్రంలోని సలాబత్పూర్ హనుమాన్ మందిరంలో ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు వారి దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించి. రాష్ట్ర ప్రజలు సుఖశాంతులతో ఉండాలని, జుక్కల్ నియోజకవర్గం మరింత అభివృద్ధి చెందాలని భగవంతుడిని ప్రార్థించారు.ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో కామారెడ్డి జిల్లా డీసీసీ అధ్యక్షులు ఏలే మల్లికార్జున్ కూడా పాల్గొని ఎమ్మెల్యేకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం ఆలయ అర్చకులు ఎమ్మెల్యే దంపతులను వేద ఆశీర్వచనాలతో ఆశీర్వదించి తీర్థప్రసాదాలు అందజేశారు.జన్మదిన వేడుకల్లో భాగంగా సేవా కార్యక్రమాలు, పర్యావరణ పరిరక్షణ కార్యక్రమాలు, ఆధ్యాత్మిక పూజలు నిర్వహించడం విశేషంగా నిలిచిందని పలువురు నాయకులు, కార్యకర్తలు పేర్కొన్నారు.