
జనం న్యూస్ 23 జూన్ 2026 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్ ; జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలో 15 రోజుల క్రిందట పిచ్చికుక్క దాడి చేసి 20 మందిని గాయపరచిన ఘటన మరువక ముందే మరోసారి పిచ్చికుక్క దాడి చేసిన ఘటన జమ్మిచేడులో జరిగింది.4వ వార్డ్ లో 15 మందిపై పిచ్చి కుక్క దాడి చేసి కరిచింది.గాయపడిన వారిని మహబూబ్ నగర్, గద్వాల ఆసుపత్రి కి తరలించారు.జిల్లా కేంద్రంలో 15 రోజుల క్రిందట నల్లకుంట, కృష్ణవేణి చౌక్, గంజిపేటలో 20 మందిని పిచ్చికుక్క కరిచిన సంఘటన మరువకముందే మరోసారి ఈ రోజు ఉదయం జమ్మిచెడులో 15 మందిపై పిచ్చికుక్క దాడి చేసి గాయపరిచిన విషయంలో మున్సిపల్ అధికారులు, జిల్లా యంత్రాంగం చర్యలు చేపట్టాలని కాలనీవాసులు పట్టణ ప్రజలు కోరుతున్నారు