

జనం న్యూస్ తెలంగాణ రాష్ట్ర బ్యూరో ఇంచార్జ్ మొహమ్మద్ ఇమ్రాన్ జూన్ 19 జహీరాబాద్ పట్టణ శివారులో జాతీయ రహదారి పక్కన ఆటవీ శాఖ ఆధ్వర్యంలో రూపుదిద్దుకున్న త్రివేణివనం- ఫారెస్ట్ ఎకో పార్చును రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గురువారం హైద్రాబాద్ నుండి వర్చువల్ ప్రారంభించారు. ఈ సందర్భంగా జహీరాబాద్ ఎంపీ సురేష్ షెట్కార్ మాట్లాడుతూ పచ్చదనం పెంపు, పర్యావరణ పరిరక్షణ కోసం రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తోందన్నారు. రాష్ట్రవ్యాప్తంగా పచ్చని వాతావరణం నెలకొల్పాలనే లక్ష్యంతో వనమహోత్సవాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన 11 ఏదో పార్చులు పార్కులను ముఖ్యమంత్రి పర్చువల్గా ప్రారంభించడం సంతోషకరమన్నారు. జహీరాబాద్ ప్రాంతం నిమ్స్ ద్వారా పారిశ్రామిక స్మార్ట్ సిటీగా రూపుదిద్దు కుంటోందని, భారీ పరిశ్రమలు రావడంతో యువతకు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు లభిస్తాయని పేర్కొన్నారు. జాతీయ రహదారి పక్కనే 208 ఎకరాల విస్తీర్ణంలో త్రివేణివనం అటవీ ఎకో పార్కును అభివృద్ధి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చినట్లు తెలిపారు. హైదరాబాద్లోని కేబీఆర్ పార్కులో ఉన్న అన్ని సౌకర్యాలు త్రివేణివనంలో కల్పించిననట్లు చెప్పారు. టీజీఐఐసీ చైర్ పర్సన్ నిర్యల జయప్రకాశ్ రెడ్డి మాట్లాడుతూ ప్రకృతిని పరిరక్షించడం ద్వారా భవిష్యత్ తరాలకు ఆరోగ్యకరమైన వాతావరణాన్ని అందించవచ్చన్నారు. మానవాళికి ప్రాణవాయువును అందించే చెట్లు, అడవులను సంరక్షించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ చెట్లను నాటి వాటిని సంరక్షించే అలవాటు చేసుకోవాలని కోరారు. జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ మాట్లాడుతూ జాతీయ రహదారి పక్కనే ఉన్న త్రివేణివనం- ఫారెస్ట్ ఎకో పార్కు ఎంతో ఆకర్షణీయంగా అభివృద్ధి చేయ బడిందన్నారు. పార్కులోసైక్లింగ్ వంటి ప్రత్యేక సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయని, ప్రజలు అధిక సంఖ్యలో సందర్శించి పార్చును సద్వినియోగం వేసుకోవాలని సూచించారు. ఇదే స్ఫూర్తితో వనమహోత్సవంలో ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి పచ్చదనాన్ని పెంపొందించాలని పిలుపునిచ్చారు. జహీరాబాద్ శాసన సభ్యులు మాణిక్స్ వు మాట్లాడుతూ త్రివేణివనం జహీరాబాద్ ప్రజలకు గొప్ప వరమని అన్నారు. మనిషి జీవితంలో చెట్లతో విడదీయరాని అనుబంధం ఉండని, చెట్లు ఉంటేనే మానవ మనుగడ సుసంపన్నంగా ఉంటుందని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ కనీసం ఒక మొక్క నాటి దానిని సంరక్షించాలని కోరారు. అనంతరం అతిథులు ఆటవీ శాఖ రూపొందించిన వనమహోత్సవ పోస్టరు ఆవిష్కరించారు. పిమ్మట సఫారీ వాహనంలో ఎకో పార్చును సందర్శించి వివిధ సౌకర్యాలను పరిశీలించడంతో పాటు మొక్కలు నాటారు. అనంతరం జెండా ఊపి సైక్లింగ్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో జిల్లా ఎస్సీ పరితోష్ వంతజ్, మున్సిపల్ చైర్మన్ యూనిస్, ఉ్నూల్ రెడ్డి,మున్సిపల్ కౌన్సిలర్లు, జిల్లా అటవీ అధికారి ప్రసాద్ రెడ్డి, నిమ్స్ డిప్యూటీ డబెక్టర్, ఆర్టీఓ, తహసీల్దార్, అటవీ శాఖ అధికారులు, పోలీసు అధికారులు, మహిళలు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు