
సంగారెడ్డి జిల్లా ఇన్చార్జ్ బి వీరేశం జనం న్యూస్ మే. 07. 04. 05. 2026 కలిగిస్తున్నాయి. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో అనుమతులు లేకుండా ఎర్రరాయి తవ్వకాలు కొనసాగుతున్నాయని స్థానిక ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. భారీ యంత్రాలతో రాత్రి వేళల్లో తవ్వకాలు జరుపుతూ ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. తవ్వకాల కారణంగా వ్యవసాయ భూములు దెబ్బతినడంతో పాటు భూగర్భ జలాలు తగ్గిపోతున్నాయని రైతులు చెబుతున్నారు. అక్రమ రవాణా కూడా బహిరంగంగానే సాగుతున్నప్పటికీ సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదని ప్రజలు మండిపడుతున్నారు. వెంటనే రెవెన్యూ, మైనింగ్, పోలీస్ శాఖ అధికారులు సంయుక్తంగా దాడులు నిర్వహించి అక్రమ తవ్వకాలను అరి కట్టాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. అక్రమ ఎర్రరాయి మాఫియాపై కఠిన చర్యలు తీసుకుని ప్రజల ఆస్తులు, ప్రకృతి సంపదను కాపాడాలని స్థానికులు కోరుతున్నారు.