
సంగారెడ్డి జిల్లా ఇన్చార్జ్ బి వీరేశం జనం న్యూస్16. 05. 2026 ఒకేసారి రావడంతో ఆలయం భక్తులతో కిక్కిరిసిపోయింది. తెల్లవారుజాము నుంచే వేలాదిగా భక్తులు ఆలయానికి చేరుకుని ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. శనిదేవునికి నువ్వుల నూనెతో తైలాభిషేకం చేసి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. మహిళలు, యువకులు, వృద్ధులు పెద్ద ఎత్తున పాల్గొని భక్తిశ్రద్ధలతో దర్శనం చేసుకున్నారు. ఆలయ ప్రాంగణం మొత్తం భక్తుల నామస్మరణలతో మార్మోగిపోయింది. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ప్రత్యేక ఏర్పాట్లు చేసి భక్తులకు తాగునీరు, ప్రసాద వితరణ, క్యూలైన్ల నిర్వహణ చేపట్టారు. పోలీసులు భద్రతా చర్యలు కట్టుదిట్టం చేసి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకున్నారు. శని అమావాస్య, శని జయంతి ఒకే రోజు రావడం ఎంతో విశేషమని పండితులు తెలిపారు. ఈ సందర్భంగా జహీరాబాద్ నియోజకవర్గ ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించడం విశేషంగా నిలిచింది.