
జనం న్యూస్ సంగారెడ్డి జిల్లా ఇన్చార్జ్ బి వీరేశం మే 24. 05. 2026 -36 వార్డు కౌన్సిలర్ అప్పం శ్రావణ్ కుమార్ జహీరాబాద్ మున్సిపాలిటీ పరిధిలో పలు పరిశ్రమలు పాత విధానంలోనే ఆస్తి పన్ను చెల్లిస్తున్నాయి. దీనివల్ల మున్సిపాలిటీ రావాల్సిన ఆదాయం కంటే తక్కువ ఆదాయం వస్తోందని 36 వార్డు కౌన్సిలర్ అప్పం శ్రావణ్ కుమార్ అన్నారు. ఈ విషయమై ఆయన మాట్లాడుతూ ఆయా పరిశ్రమల వ్యాపారం పెరిగి విస్తరించినా కూడా పాత పన్ను విధానమే కొనసాగించడం సరికాదని అభిప్రాయపడ్డారు. వెంటనే అటువంటి పరిశ్రమలను గుర్తించి వాటికి రీఅసెస్మెంట్ చేయాలని మున్సిపల్ అధికారులను డిమాండ్ చేశారు. ప్రస్తుత నిబంధనలకు అనుగుణంగా పన్ను విధానం అమలు చేయాలని మున్సిపల్ కమిషనరును కోరారు. మధ్య తరహా, భారీ పరిశ్రమలకు రీఅసెస్మెంట్ చేయడం ద్వారా మున్సిపాలిటీకి మరింత ఆదాయం సమకూరు తుందని శ్రావణ్ కుమార్ అభిప్రాయపడ్డారు. ఆ నిధులతో పట్టణంలో మరిన్ని మౌలిక వసతులను కల్పించే వీలుంటుం దన్నారు. అంతేకాకుండా అభివృద్ధి పనులను కూడా చేపట్టవచ్చని అధికారులకు విజ్ఞప్తి చేశారు.