
జనం న్యూస్ :29 ఆగస్టు శనివారం: సిద్దిపేట నియోజికవర్గ ఇన్చార్జి వై.రమేష్ ;సిద్దిపేటకు చెందిన కవయిత్రి ఎడ్ల లక్ష్మి రేగులపాటి లక్ష్మి జాతీయ బాలసాహిత్య పురస్కారం 2025 ఎంపికైనట్లు రంగినేని ట్రస్ట్ అధ్యక్షులు నవీన్ కుమార్ తెలిపారు. ప్రతి సంవత్సరం సిరిసిల్లలో రంగినేని ట్రస్ట్ లో పిల్లల పండుగ నిర్వహిస్తున్న సందర్భంగా ఈ సంవత్సరం బాలసాహిత్య పురస్కారం ఎడ్ల లక్ష్మికి ఇస్తున్నామన్నారు. బాలసాహిత్యంలో గేయాలు, కథలు రాసి పలు పుస్తకాలు ప్రచురించిన ఎడ్ల లక్ష్మి అవార్డుకు ఎంపిక కావడం పట్ల సిద్దిపేట కవులు ఉండ్రాళ్ళ రాజేశం, వరుకోలు లక్ష్మయ్య, పెందోట వెంకటేశ్వర్లు, బస్వ రాజ్ కుమార్, పర్శరాములు, కాల్వ రాజయ్య, సుధాకర్ తదితరులు అభినందనలు తెలిపారు.