
జనం న్యూస్ జులై 16 2026(ఎల్కతుర్తి మండల్ బండి కుమారస్వామి రీపోటర్ )హనుమకొండ జిల్లా మంత్రి పొన్నం ప్రభాకర్ గారి ఆదేశాల మేరకు, ఎల్కతుర్తి, బీమదేవరపల్లి మండలాల రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని ధర్మసాగర్ నార్త్ దేవాదుల కాల్వ ద్వారా తక్షణమే సాగునీటిని విడుదల చేయాలని కోరుతూ గురువారం జిల్లా కలెక్టర్కు వినతిపత్రం సమర్పించారు.జిల్లా కలెక్టర్ సమస్యపై సానుకూలంగా స్పందిస్తూ, సంబంధిత నీటిపారుదల శాఖ అధికారులతో వెంటనే మాట్లాడి రైతులకు అవసరమైన సాగునీటిని విడుదల చేసే దిశగా తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఎల్కతుర్తి , బీమదేవరపల్లి మండలాల్లో పంటలు సాగు చేస్తున్న రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం అత్యవసరంగా సాగునీటిని విడుదల చేయాలని నాయకులు విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమంలో ఎల్కతుర్తి కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ముప్పు శ్రీనివాస్ బొమ్మనపల్లి అశోక్ రెడ్డి, సింగిల్ విండో మాజీ అధ్యక్షులు గోలి రాజేశ్వర్ రావు, యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు అంబాల శ్రీకాంత్ బక్కి, ఎల్కతుర్తి, బీమదేవరపల్లి మండలాల రైతులు పాల్గొన్నారు