
జుక్కల్ జూన్ 6 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా జుక్కల్ మండలం కేంద్రంలోని గ్రామపంచాయతీ కార్యాలయంలో సర్పంచ్ కర్రెవార్ సావిత్రి అధ్యక్షతన ప్రత్యేక గ్రామసభ సమావేశం ఏర్పాటుచేసి ఎజెండా అంశములవారిగా చదివి అధికారులు ప్రజలకు అవగాహన కల్పించడమైనది.. వర్షాకాలంలో తీసుకోవలసిన జాగ్రత్తలు మరియు ప్లాస్టిక్ నిషేధము ఘన వ్యర్థాలపై ప్రజలకు వివరించడం జరిగింది. 2026-27 సంవత్సరంకు సంబంధించి జిపిడిపి యాక్షన్ ప్లాన్ లో పనులను గుర్తించి తీర్మానించడం జరిగింది.. ఓటర్ జాబితా సవరణ, ఇందిరమ్మ ఇళ్ల పురోగతి,వ్యవసాయ శాఖ, ఎలక్ట్రిసిటీ, ఆరోగ్యం, అంగన్వాడి, ఉపాధి హామీ పనులు, మిషన్ భగీరథ నీరు , పారిశుద్ధ్యము నిర్వాహన పై చర్చించి ప్రజలు తీర్మానించడం జరిగింది.. ఇట్టి కార్యక్రమానికి సర్పంచ్, ఉప సర్పంచ్ ,పాలకవర్గ సభ్యులు, ఎక్స్ ఎంపీటీసీ ఇమ్రాన్ ఖాన్, పంచాయతీ కార్యదర్శి,గ్రామ సభ ప్రత్యేక అధికారి గ్రిడ్ ఏఈ ఆఫ్రాన్, ఏపీవో తులసీరాం,aeo పండరి, లైన్మెన్ సాయిలు విజయ్ కుమార్ . గ్రామ పెద్దలు, గ్రామస్థాయి అధికారులు, తదితరులు పాల్గొన్నారు..