
జుక్కల్ ఆగస్టు 26 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా జుక్కల్ మండల కేంద్రం లో జామియా మజీద్ నుండి ర్యాలీ గా ప్రారంభం చేసుకొని అంబేద్కర్ చౌరస్తా మీదిగా ఖాతిజ మజీద్ మీదగా జామియా మజీద్ వరకు చేరుకొని అనంతరం అన్నదాన కార్యక్రమం చేయడం జరిగింది మత పెద్దలు మాట్లాడుతూ...మహమ్మద్ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) చూపిన శాంతి, ప్రేమ, సోదరభావం, మానవత్వం, పరస్పర గౌరవం వంటి విలువలను ప్రతి ఒక్కరూ ఆచరించాలని ఆకాంక్షిస్తున్నాము.
ఈ పవిత్ర పర్వదినం ప్రతి కుటుంబంలో సుఖసంతోషాలు, శాంతి, ఐక్యత, ఆరోగ్యం మరియు అభివృద్ధి నింపాలని, జుక్కల్ నియోజకవర్గ ప్రజలందరూ సుఖశాంతులతో జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము.జాష్నే ఈద్ మిలాద్-ఉన్-నబీ ముబారక్!ఈ కార్యక్రమం లో జుక్కల్ గ్రామ సర్పంచ్ శ్రీమతి సావిత్రి సాయగౌడ్ గారు బస్వపూర్ గ్రామ సర్పంచ్ W. రమణ సురేష్ గొండ గారు DCC ప్రధాన కార్యదర్శి షైక్ ఇమ్రాన్, జుక్కల్ ఉపసర్పంచ్ షైక్ ఫిర్దోస్,మైనారిటీ అధ్యక్షులు షాదుల్, మీలాద్ కమిటీ అధ్యక్షులు సయ్యద్ షాఖిల్ గారు,మత పెద్దలు చిన్నారు గ్రామ యువత పాల్గున్నారు