
జనం న్యూస్ - జూన్ 1- నాగార్జునసాగర్ టౌన్ -జూన్ 3వ తేదీన నకిరేకల్ నియోజకవర్గ లో జరిగే టీయూడబ్ల్యూజే (ఐజేయూ) జిల్లా మహాసభలను విజయవంతం చేయాలని జిల్లా ప్రెస్ క్లబ్ కార్యదర్శి దాసిరెడ్డి శ్రీనివాసరెడ్డి పిలుపునిచ్చారు,సోమవారం నాగార్జునసాగర్‌లోని విజయ విహార్ అతిథి గృహంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు,ఈ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు,ఈ సందర్భంగా శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ జిల్లాలోని ప్రతి మండలం,పట్టణం నుండి జర్నలిస్టులు ఈ మహాసభకు భారీ సంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలని కోరారు. జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి,వారి హక్కుల రక్షణ కోసం నిరంతరం క్షేత్రస్థాయిలో పోరాడే నమ్మకమైన సంఘం టీయూడబ్ల్యూజే (ఐజేయూ) మాత్రమేనని ఆయన స్పష్టం చేశారు,ఈ మహాసభలలో జర్నలిస్టుల సంక్షేమం కోసం పలు కీలక తీర్మానాలను ప్రవేశపెట్టనున్నట్లు ఆయన తెలిపారు,అలాగే అర్హులైన ప్రతి జర్నలిస్టుకు అక్రిడిటేషన్ కార్డులు మంజూరు చేయడం. ఇంటి స్థలాలు,ఇండ్ల నిర్మాణం చేపట్టడం,హెల్త్ కార్డుల సౌకర్యం కల్పించడం.జర్నలిస్టుల న్యాయమైన డిమాండ్ల సాధన కోసం యూనియన్ ఎల్లప్పుడూ ముందుంటుందని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు,అలాగే నల్లగొండ జిల్లా అధ్యక్షులు గార్లపాటి కృష్ణారెడ్డి అధ్యక్షతన ఈ ప్రతిష్టాత్మక మహాసభలకు తెలంగాణ రాష్ట్ర ప్రెస్ అకాడమీ చైర్మన్ కె.శ్రీనివాసరెడ్డి, యూనియన్ రాష్ట్ర అధ్యక్ష,ప్రధాన కార్యదర్శులు విరాహత్ అలీ,కె. రాంనారాయణ,రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ప్రభాకర్ రెడ్డి తదితరులు ముఖ్య అతిథులుగా హాజరవుతున్నట్లు వెల్లడించారు.ఈ సమావేశంలో నాగార్జునసాగర్,జర్నలిస్టు నాయకులు పాకాల నరసింహ, టి కే ప్రకాష్, కోడ అప్పారావు, సిహెచ్. యోబు రాజు,రవీంద్ర కుమార్,గోరంట్ల శివరామ ప్రసాద్,విజయ్,సత్యనారాయణ,తదితరులు పాల్గొన్నారు.