

జనం న్యూస్ తేదీ 16-07-2026 జూలై 11, 12 తేదీలలో గద్వాల్ జిల్లాలో నిర్వహించిన వుషూ రాష్ట్ర స్థాయి ఛాంపియన్‌షిప్‌లో సంగారెడ్డి జిల్లా, జహీరాబాద్‌కు చెందిన వజ్ర వీర మార్షల్ ఆర్ట్స్ అకాడమీ విద్యార్థులు విశేష ప్రతిభ కనబరిచి పతకాలు సాధించారు.విజేతలు: ఆయుష్ – అండర్-14 సాండా, 39 కేజీల విభాగం – రజత పతకం, మొత్తం 6 రౌండ్లు పోటీ పడి ఈ ఘనత సాధించాడు. నవ్య శ్రీ – అండర్-14 బాలికల 52 కేజీల విభాగం – కాంస్య పతకం, మొత్తం 2 రౌండ్లు పోటీ పడింది. ఉమా మహేశ్వరి – జూనియర్ విభాగం, 46 కేజీల విభాగం – కాంస్య పతకం సాధించింది.ఈ సందర్భంగా విద్యార్థులను మాస్టర్స్ శంకర్ సాగర్, సిద్ధా రెడ్డి, శ్లోక్ సాగర్ అభినందిస్తూ, భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. విజేతలకు, పాల్గొన్న విద్యార్థులందరికీ మరియు వారి తల్లిదండ్రులకు వజ్ర వీర మార్షల్ ఆర్ట్స్ అకాడమీ హృదయపూర్వక అభినందనలు తెలియజేసింది.