
జనం న్యూస్ జూన్ 30 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి : శాయంపేట మండలంలో ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో గో టు విలేజ్ కార్యక్రమం, జూలై 7న జరిగే ఎమ్మార్పీఎస్ 32వ ఆవిర్భావ దినోత్సవ జెండా ఆవిష్కరణ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి అని మండలంలోని గట్లకానిపర్తి, మైలారం గ్రామాలలో సమావేశం నిర్వహించారు.ఈ సమావేశానికి ఎమ్మార్పీఎస్ మండల ఇన్చార్జి, ఎంఎస్పీ మండల అధ్యక్షుడు మామిడి భాస్కర్ మాదిగ హాజరై ఆయన మాట్లాడుతూ పద్మశ్రీ మందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు ప్రతి గ్రామంలో కార్యక్రమాలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. మాదిగ జాతి అభ్యున్నతి కోసం మందకృష్ణ మాదిగ మూడు దశాబ్దాలుగా ఉద్యమం చేశారని పేర్కొన్నారు.ఆ ఉద్యమ ఫలితంగానే వర్గీకరణ సాధనలో కీలక విజయాలు లభించాయని అన్నారు.వర్గీకరణ ద్వారా లభించే అవకాశాలను మాదిగ యువత సద్వినియోగం చేసుకోవాలని తెలిపారువిద్యలో ముందుండి ఉన్నత స్థానాలను చేరుకోవాలని విద్యార్థులకు పిలుపునిచ్చారు.జూలై 7న ప్రతి గ్రామంలో ఎమ్మార్పీఎస్ జెండా ఆవిష్కరణ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించాలని కోరారు.దళిత ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని ఉద్యమ స్ఫూర్తిని చాటాలని అన్నారు.గో టు విలేజ్ కార్యక్రమం ద్వారా గ్రామస్థాయిలో ప్రజలకు ఉద్యమ లక్ష్యాలను వివరించాలని సూచించారు.ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా ఎమ్మార్పీఎస్ రాష్ట్ర నాయకులు అరికిల్ల దేవయ్య మాదిగ డప్పు కళాకారుల సంఘం జిల్లా అధ్యక్షుడు కోగల రవి మాదిగ సమావేశంలో కోవెల సుమన్ మాదిగ, సదానంద మాదిగ సమావేశంలో మాట్లాడారు.ఎమ్మార్పీఎస్ గ్రామ కమిటీ అధ్యక్షుడు బొమ్మకంటి భద్రయ్య మాదిగఉపాధ్యక్షుడు బొమ్మకంటి కుమారస్వామి మాదిగబొమ్మకంటి ఆనందం మాదిగ, బొమ్మకంటి పోచయ్య మాదిగచిలుక గోపి, బొమ్మకంటి చంద్రమౌళి మాదిగతో పాటు పలువురు మాదిగ కుల పెద్దలు తదితరులు పాల్గొన్నారు