
. ప్రభుత్వ మద్దతు ధర క్వింటాలుకు 3699…
బిచ్కుంద మే 20 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండల కేంద్రంలోని మార్కెట్ కమిటీ యార్డులో బిచ్కుంద రైతు సేవ సహకార సంఘం ఆధ్వర్యంలో జొన్న కొనుగోలు కేంద్రాన్ని సొసైటీ అధ్యక్షులు నాల్పూర్ బాలాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ కవిత ప్రభాకర్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం జొన్న క్వింటాలికి 3699 రూపాయల మద్దతు ధర ప్రకటించిందన్నారు.రైతులు ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలలోనే పంటను విక్రయించాలన్నారు. దళారుల మాటలు నమ్మి మోసపోవద్దని తెలిపారు.ఈ కార్యక్రమంలో చైర్మన్ తో పాటు మున్సిపల్ చైర్మన్ సీమ షెట్కార్ మార్కెట్ కమిటీ ఉపాధ్యక్షుడు శంకర్
మరియు సొసైటీ వైస్ చైర్మన్ యాదరావు కౌన్సిలర్లు దర్పల్ గంగాధర్, నాషా నాయక్ సీఈఓ శ్రావణ్ కుమార్, రైతులు తదితరులు పాల్గొన్నారు.