
జనం న్యూస్ 06 ఆగస్టు 2026 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్ జోగులాంబ గద్వాల్ జిల్లా మల్దకల్ మండలం, నీలిపల్లి గ్రామంలోని విద్యార్థులు ప్రతిరోజూ స్కూల్ మరియు కాలేజీలకు వెళ్లడానికి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆర్టీసీ బస్సు మా గ్రామంలోకి రాకపోవడంతో చిన్నపిల్లలు బాలికలు మరియు విద్యార్థులందరూ గ్రామం బయట ఉన్న స్టేజి వరకు వెళ్లి బస్సు ఎక్కాల్సిన పరిస్థితి ఏర్పడింది.ఈ సమస్యను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఈరోజు నీలిపల్లి గ్రామ స్టేజి వద్ద గ్రామ సర్పంచ్ ఉపసర్పంచ్ విద్యార్థులు విద్యార్థుల తల్లిదండ్రులు గ్రామ పెద్దలు మరియు గ్రామ ప్రజలందరం కలిసి శాంతియుతంగా ధర్నా నిర్వహిస్తున్నాము. మా ప్రధాన డిమాండ్: ఆర్టీసీ అధికారులు వెంటనే స్పందించి, జోగులాంబ గద్వాల్ జిల్లా మల్దకల్ మండలం నీలిపల్లి గ్రామంలోకి ఆర్టీసీ బస్సును తీసుకువచ్చి విద్యార్థులను గ్రామంలోనే ఎక్కించుకొని వెళ్లే విధంగా తక్షణ చర్యలు తీసుకోవాలి.ఇది రాజకీయ కార్యక్రమం కాదు. ఇది మా గ్రామ విద్యార్థుల విద్య భద్రత మరియు భవిష్యత్తుకు సంబంధించిన న్యాయమైన డిమాండ్. సంబంధిత ఆర్టీసీ అధికారులు వెంటనే స్పందించి శాశ్వత పరిష్కారం చూపాలని నీలిపల్లి గ్రామ ప్రజలందరం కోరుతున్నాము. నీలిపల్లి గ్రామ ప్రజల తరఫున మల్దకల్ మండలం జోగులాంబ గద్వాల్ జిల్లాగ్రామ సర్పంచ్ ఉపసర్పంచ్ విద్యార్థులు విద్యార్థుల తల్లిదండ్రులు గ్రామ పెద్దలు మరియు గ్రామ ప్రజలు