
జనం న్యూస్ 27 మే 2026 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్ జోగుళాంబ గద్వాల జిల్లాలో ఉన్న మన దివ్యాంగ సోదరీమణులు తమకు ఏదైనా సమస్య వచ్చినప్పుడు లేదా ఏదైనా విషయం జెన్యూన్ అనిపించినప్పుడు తమకు నచ్చిన లేదా నమ్మకమైన ఏ సంఘంతోనైనా కలిసి వెళ్ళే పూర్తి హక్కు వారికి ఉంది. అది పూర్తిగా వారి వ్యక్తిగత నిర్ణయం. కానీ ఒక దివ్యాంగురాలు వేరే సంఘంతో వెళ్ళింది అనే కారణంతో ఆమెను వేధించడం తిట్టడం లేదా మానసికంగా ఇబ్బంది పెట్టడం వంటివి చేయడం అత్యంత విచారకరం మరియు అన్యాయం. ఇలాంటి పనులు చేసే వారు దివ్యాంగుల శ్రేయస్సు కోరేవారు కానే కాదు గుర్తుంచుకోండి సంఘాలు ఉన్నది దివ్యాంగులను రక్షించడానికి వారికి అండగా నిలబడటానికి మాత్రమే దివ్యాంగులను భయపెట్టడానికి కాదు*ఉదయ్ అసోసియేషన్ స్పష్టమైన విధానం* మేము దివ్యాంగుల రక్షణ ఉద్యోగ ఉపాధి అవకాశాల విషయంలో ఎప్పుడూ రాజీపడము ఏ దివ్యాంగుడికైనా ఏ సోదరికైనా అన్యాయం జరిగితే అండగా నిలబడటమే మా మొదటి ప్రాధాన్యతజిల్లాలో ఉన్న అన్ని సంఘాలకు మా విన్నపం ఒక్కటే మనం ఉన్నది మన వారిని రక్షించుకోవడానికి వారి ఆత్మగౌరవాన్ని కాపాడటానికి మనసు విప్పి ఆలోచించండి ఐక్యతతో మన వారిని కాపాడుకుందాం