
జోగులాంబ గద్వాల జిల్లా కలెక్టర్ కి జోగులాంబ గద్వాల జిల్లా పోలీసు సూపరింటెండెంట్ (ఎస్పీ) కి జోగులాంబ గద్వాల జిల్లా జిల్లా వైద్య & ఆరోగ్య అధికారి (డి ఎం ఓ) కి జోగులాంబ గద్వాల జిల్లా విద్యుత్ శాఖ సూపరింటెండింగ్ ఇంజనీర్ (ఎస్ ఈ) కి ఆలంపూర్ ప్రభుత్వ ఆసుపత్రి వైద్యాధికారి సివిల్ సర్జన్ కి విద్యుత్ శాఖ అసిస్టెంట్ ఇంజనీర్ (ఏయి) కి ఆలంపూర్ మున్సిపల్ కమిషనర్ కి ఆలంపూర్ మున్సిపల్ చైర్మన్ కి మరియు మున్సిపల్ కౌన్సిలర్లందరికీ ఆలంపూర్ సర్కిల్ ఇన్స్పెక్టర్ కి ఆలంపూర్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ (ఎస్హెచ్ఓ) కి ఆలంపూర్ ప్రతిలిపి ప్రింట్ మీడియా మిత్రులకు. విషయం: వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రజల భద్రత కోసం ముందస్తు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి.మహోదయులకుప్రస్తుతం వర్షాకాలం కొనసాగుతున్న నేపథ్యంలో ఆలంపూర్ పరిసర ప్రాంతాల్లో తుంగభద్ర నది పెద్ద వాగులు మరియు నాలాలు ఉండటంతో పాములు నివాస ప్రాంతాల్లోకి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ పరిస్థితుల్లో పాము కాటు వంటి అత్యవసర ఘటనలు సంభవించే అవకాశం ఉన్నందున, ఆలంపూర్ ప్రభుత్వ ఆసుపత్రిలో యాంటీ స్నేక్ వెనం ఇంజెక్షన్లు మరియు అవసరమైన అత్యవసర వైద్య సదుపాయాలు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని జిల్లా వైద్య & ఆరోగ్య శాఖ అధికారులను వినయపూర్వకంగా కోరుతున్నాము.ప్రస్తుతం అత్యవసర పరిస్థితుల్లో చాలా మంది ప్రజలు చికిత్స కోసం కర్నూలుకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. ఈ ఇబ్బందులు తలెత్తకుండా ఆలంపూర్ ప్రభుత్వ ఆసుపత్రి లోనే తగిన వైద్య సదుపాయాలు సిద్ధంగా ఉంచితే ప్రజలకు ఎంతో ఉపశమనం కలుగుతుంది.అలాగే వర్షాకాలంలో విద్యుత్ స్తంభాలు, విద్యుత్ తీగలు, ట్రాన్స్ఫార్మర్లు దెబ్బతిని విద్యుత్ షాక్ ప్రమాదాలు సంభవించే అవకాశం ఉన్నందున, విద్యుత్ శాఖ అధికారులు అన్ని విద్యుత్ స్తంభాలు, తీగలు మరియు ఇతర విద్యుత్ పరికరాలను క్షుణ్ణంగా తనిఖీ చేసి, అవసరమైన మరమ్మతులు చేపట్టి ప్రజల ప్రాణ భద్రతకు అవసరమైన చర్యలు తీసుకోవాలని మనవి.ప్రజల భద్రతను దృష్టిలో ఉంచుకొని సంబంధిత అన్ని శాఖలు సమన్వయంతో ముందస్తు చర్యలు చేపట్టాలని వినయ పూర్వకంగా కోరుతున్నాము.ధన్యవాదములతో మహమ్మద్ యాసీన్ జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధికార ప్రతినిధి