
జనం న్యూస్ 26 జూన్ 2026 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్ రాజోలి బండ డైవర్షన్ స్కీం (ఆర్ డి యస్ ) పై కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం అక్రమంగా నిర్మిస్తున్న కురిడి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ ప్రాజెక్టును వెంటనే ఆపాలని అందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తగిన చర్యలు చేపట్టాలని భారత కమ్యూనిస్టు పార్టీ మార్క్సిస్టు సి పి యం జోగులాంబ గద్వాల జిల్లా కమిటీ డిమాండ్ చేసింది. గురువారం జిల్లా కేంద్రంలోని స్థానిక సి పి యం జిల్లా కార్యాలయంలో జరిగిన సమావేశంలో సిపిఎం జిల్లా కార్యదర్శి ఏ వెంకటస్వామి మాట్లాడుతూ ఆర్డీఎస్ ద్వారా తెలంగాణకు రావలసిన 15.9 టిఎంసిల నికర జలాలు ఏనాడు రాలేదని,అలంపూర్ నియోజకవర్గంలోని గ్రామాలకు 87,500 ఎకరాలకు సాగునీరు అందాల్సి ఉండగా 25 వేల ఎకరాలకు మించి నీరు అందడం లేదని అలాంటి పరిస్థితులలో మళ్లీ కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం అక్రమంగా నీటిని మళ్లించేందుకు ప్రాజెక్టులు కట్టడం వల్ల పూర్తిస్థాయిలో నీరు అందక రైతులు ఇబ్బందులు పడాల్సి వస్తుందని వెంటనే అక్రమ ప్రాజెక్టుల నిర్మాణాన్ని కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం ఆపాలని డిమాండ్ చేశారు. కర్ణాటక ప్రభుత్వం అక్రమంగా ప్రాజెక్టులు నిర్మాణం చేస్తుంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, జిల్లా ఇరిగేషన్ అధికారులు చూసి చూడనట్టు వ్యవహరించడం సరైంది కాదని వెంటనే కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మాట్లాడి నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులను ఆపే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. ఒప్పందం ప్రకారం అందాల్సిన నీటి వాటా అందకపోవడం, ఆర్డీఎస్ కాల్వ ఆధునీకరణ పనులు జరగకపోవడం వల్ల వేల ఎకరాల భూములు బీడుగా మారాయని అలంపూర్ నియోజకవర్గంలోని రైతులు వలసలు వెళ్లే పరిస్థితి ఏర్పడిందని అన్నారు.తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే చొరవ తీసుకొని అక్రమ ప్రాజెక్టులను ఆపాలని జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ నియోజకవర్గానికి అందాల్సిన నీటి వాటా మొత్తం అందే విధంగా కృషి చేయాలని ఆర్డీఎస్ ఆధునీకరణ పనులు వెంటనే చేపట్టాలని డిమాండ్ చేశారుసమావేశంలో సిపిఎం జిల్లా కార్యదర్శి ఏ. వెంకటస్వామి తో పాటు జిల్లా కమిటీ సభ్యులు వివి. నరసింహ జి రాజు ఉప్పేరు నరసింహ ఉన్నారు వెంకటస్వామి సి పి యం జిల్లా కార్యదర్శి జోగులాంబ గద్వాల జిల్లా కమిటీ