
నియామక పత్రాన్ని అందజేసిన పార్టీ చీఫ్ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న
జిల్లాలో పార్టీ బలోపేతానికి కృషి చేస్తా మహమ్మద్ గౌస్ పాషా
జనం న్యూస్ జూన్ 20,వికారాబాద్ జిల్లా పరిగి నియోజకవర్గం: తెలంగాణ రాజ్యాధికార పార్టీ సంస్థాగత బలోపేతంలో భాగంగా ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఇంచార్జి బంధారపు నర్సయ్య గౌడ్ ఆధ్వర్యంలో వికారాబాద్ జిల్లా అధ్యక్షులుగా పరిగి నియోజకవర్గ ఇంచార్జిగా మహమ్మద్ గౌస్ పాషా, ను నియమించడం జరిగింది. ఈ సందర్భంగా పార్టీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో పార్టీ అధినేత, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న, చేతుల మీదుగా నియామక పత్రాన్ని అందుకున్న మహమ్మద్ గౌస్ పాషా, ఈ సందర్భంగా మల్లన్న, మాట్లాడుతూ, రాష్ట్రంలో మైనారిటీలకు సరైన రాజకీయ ప్రాతినిధ్యం కల్పించాల్సిన అవసరం ఉందని తెలిపారు. మైనారిటీల హక్కుల సాధనలో తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఎప్పుడూ ముందుంటుందని, వారికి సముచిత స్థానం కల్పించడమే పార్టీ లక్ష్యమని పేర్కొన్నారు. జిల్లాలో పార్టీ బలోపేతానికి కృషి చేస్తా.. గౌస్ పాషా,నాపై నమ్మకం ఉంచి జిల్లా బాధ్యతలు అప్పజెప్పిన పార్టీ అధిష్టానానికి కృతజ్ఞతలు తెలిపిన మహమ్మద్ గౌస్ పాషా, ఈ సందర్భంగా గౌస్ పాషా, మాట్లాడుతూ, తనపై నమ్మకం ఉంచి కీలక బాధ్యతలు అప్పగించిన పార్టీ అధినేత తీన్మార్ మల్లన్న,కు అలాగే పార్టీ నాయకత్వానికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. పార్టీ అభివృద్ధికి కట్టుబడి పనిచేస్తానని,వికారాబాద్ జిల్లాలో పార్టీని బలోపేతం చేయడానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పార్టీ ఉపాధ్యక్షులు ఎల్లబోయిన ఓదెలు యాదవ్, మహబూబ్నగర్ జిల్లా అధ్యక్షులు మున్నూరు జై పాల్ రెడ్డి,స్టేట్ ఆఫీస్ కో ఆర్డినేటర్ లింగం యాదవ్ పాల్గొన్నారు.