
జనం న్యూస్ 16 జూలై 2026 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్ తెలంగాణ రాజ్యాధికార పార్టీలో చేరికలు తెలంగాణ రాజ్యాధికార పార్టీ అధినేత తీన్మార్. మల్లన్న ఆదేశానుసారం. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా ఇన్చార్జి వేములవాడ మదన్మోహన్ రావు కోరిక మేరకు అయిజ మండలం రాజాపురం గ్రామానికి చెందిన పలువురు పార్టీలో చేరిక తెలంగాణ రాజ్యాధికార పార్టీ జోగులాంబ గద్వాల్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ సింధనూర్ ఉప్పరి గంగాధర్ సమక్షంలో పలువురు నాయకులు తెలంగాణ రాజ్యాధికార పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఆయన పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో జోగులాంబ గద్వాల్ జిల్లా మీడియా ఇంచార్జ్ యు రాముడు అయిజ మండల ప్రధాన కార్యదర్శి జుంజు కృష్ణ, ఈ కార్యక్రమంలో ఉన్నారు. సందర్భంగా సింధనూర్ ఉప్పరి గంగాధర్, మాట్లాడుతూ. బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ కులాలకు అందరికీ మన తెలంగాణ రాజ్యాధికార పార్టీ అండగా నిలుస్తుంది. అదేవిధంగా జోగులాంబ గద్వాల జిల్లాలో ఉన్నటువంటి అన్ని మండలాలలో అలాగే గ్రామాలలో కూడా సభ్యత్వ నమోదు కార్యక్రమం జరుగుతుంది. కావున ప్రతి ఒక్కరూ తెలంగాణ రాజ్యాధికార పార్టీలో చేరగలరని ఆకాంక్షిస్తున్నాం. ఈ సందర్భంగా తెలంగాణ రాజ్యాధికార పార్టీలో చేరిన వారు సలహాదారుడు సింధనుర్ బసవ స్వామి రాజాపురం గ్రామం నుండి సురేంద్ర గౌడ్ వి. కృష్ణ టి. హనుమంతు కె. రమేష్ కె. రామకృష్ణ, కె. నరసింహులు డి. తిమ్మప్ప, టి. నరసింహులు డి. సంజన్న, ఇ. రంగన్న గౌడ్ టి. పరమేష్, టి ఎస్. రంగన్న, టి. వెంకటేష్, టి. కిష్టప్ప టి రాముడు బి. జె. ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.