
జనం న్యూస్ ; 7 ఆగస్టు శుక్రవారం ; సిద్దిపేట నియోజిక వర్గ ఇన్చార్జి వై.రమేష్; యస్టీయు రాష్ట్ర సంఘం రూపొందించిన (ఐదు వందల రూపాయలకు తక్కువ ధరకు) టెట్ పేపర్1, పేపర్II-గణితం,సైన్స్, సాంఘిక శాస్త్ర మెటీరియల్ సిద్దిపేట జిల్లాలో జరుగుతున్న ఐసిటి శిక్షణలో జిల్లా గవర్నమెంట్ ఎగ్జామినేషన్ అసిస్టెంట్ కమిషనర్ లక్ష్మయ్య, మండల విద్యాధికారులు , గెజిటెడ్ ప్రధానోపాధ్యాయుల సంఘాలు, జిల్లా ఆర్పీలు , కోర్సు కన్వీనర్, ప్రధానోపాధ్యాయులు , మోడల్ స్కూల్ ప్రిన్సిపల్, కేజివీబి యస్ ఓల సమక్షంలో సిద్దిపేట జిల్లా ప్రధాన కార్యదర్శి పట్నం భూపాల్ తో ఆవిష్కరించడం జరిగింది. మెటీరియల్ ప్రాముఖ్యత రాష్ట్ర సంఘం కృషిని తెలియజేసి, ఇన్ సర్విస్ టెట్ పరీక్ష రాసే ఉపాధ్యాయులందరూ ఇట్టి మెటీరియల్ ను ఉపయోగించుకోవాలన్నారు. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఉన్నందున అందరూ ఉపాధ్యాయులకు తెలియజేయాలని కోరడం జరిగింది.