

జనం న్యూస్ 10 ఆగస్టు 2026 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్ ; తెలంగాణ రాజ్యాధికార పార్టీ జోగులాంబ గద్వాల జిల్లా కమిటీ బాధిత కుటుంబానికి రూ.5 కోట్ల ఎక్స్గ్రేషియా ప్రకటించేలా తెలంగాణ ప్రభుత్వం ఏపీ ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలి ఐజ పాత బస్టాండ్ చౌరస్తాకు డాక్టర్ ప్రియాంక చౌరస్తా గా నామకరణం చేయాలి టి ఆర్ పి జిల్లా అధ్యక్షుడు మొరుగు వీరేష్ఐజ: రాజమహేంద్రవరంలో జరిగిన డాక్టర్ కనికె ప్రియాంక మృతి ఘటనపై సమగ్ర దర్యాప్తు నిర్వహించి, ఆమె మరణానికి కారకులైన వారిని చట్టప్రకారం కఠినంగా శిక్షించాలని తెలంగాణ రాజ్యాధికార పార్టీ టి ఆర్ పి జోగులాంబ గద్వాల జిల్లా అధ్యక్షుడు మొరుగు వీరేష్ డిమాండ్ చేశారు.ఐజ మండలం ఏక్లాస్పురం గ్రామానికి చెందిన కనిక వెంకటేష్ కుమార్తె డాక్టర్ ప్రియాంక మృతి ఘటనను నిరసిస్తూ ఆదివారం సాయంత్రం 4 గంటలకు ఐజ ఠాగూర్ స్కూల్ ఆవరణలో నిర్వహించిన అఖిలపక్ష సమావేశంలో మొరుగు వీరేష్ పాల్గొని ప్రసంగించారుఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైద్య విద్యను అభ్యసిస్తున్న డాక్టర్ ప్రియాంకకు జరిగిన ఘటన అత్యంత బాధాకరమని ఇలాంటి ఘటన మరే విద్యార్థికి యువతికి జరగకుండా ప్రభుత్వాలు కఠిన చర్యలు చేపట్టాలని అన్నారు. రాజమహేంద్రవరంలో సినిమా చూసి స్కూటీపై తిరిగి వస్తున్న ప్రియాంకపై కారు ఢీకొన్న ఘటనలో ఆమె తీవ్రంగా గాయపడి మృతి చెందడం రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలను కలచివేసిందన్నారు.ఘటనకు సంబంధించి వెలుగులోకి వస్తున్న వివరాల ప్రకారం మాల్ సమీపంలో కొంతమంది యువకులకు భద్రతా సిబ్బందితో వాగ్వాదం జరిగినట్లు అనంతరం వారు కారులో వేగంగా వెళ్లిన సమయంలో ప్రియాంక ప్రయాణిస్తున్న స్కూటీని ఢీకొన్నట్లు దర్యాప్తులో పలు అంశాలు పరిశీలనలో ఉన్నాయని తెలిపారు. కారు ప్రియాంకను ఢీకొన్న తీరు సి సి టి వి దృశ్యాలు నిందితుల ప్రవర్తన తదితర అంశాలపై పోలీసులు సమగ్రంగా దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉందన్నారు.ఇది ప్రమాదమా లేక ఉద్దేశపూర్వకంగా కారుతో ఢీకొట్టారా అనే విషయాన్ని శాస్త్రీయ ఆధారాలతో పోలీసులు తేల్చాలని మొరుగు వీరేష్ కోరారు. ప్రస్తుత దశలో దర్యాప్తు పూర్తికాకముందే ఘటనను తుది నిర్ణయంగా హత్యగా పేర్కొనడం కంటే అందుబాటులో ఉన్న సి సి టివి దృశ్యాలు ప్రత్యక్ష సాక్షుల వాంగ్మూలాలు ఫోరెన్సిక్ ఆధారాలు వాహనం కదలికలు తదితర అంశాలను పరిశీలించి వాస్తవాలను వెలుగులోకి తేవాలని అన్నారు.బాధిత కుటుంబానికి రూ.5 కోట్ల ఎక్స్గ్రేషియా ఇవ్వాలి డాక్టర్ ప్రియాంక కుటుంబం తీవ్ర విషాదంలో ఉందని తల్లిదండ్రులకు ప్రభుత్వం అండగా నిలవాలని మొరుగు వీరేష్ అన్నారు. కనికె వెంకటేష్ కుటుంబానికి రూ.5 కోట్ల ఎక్స్గ్రేషియా అందించేలా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై తెలంగాణ ప్రభుత్వం ఒత్తిడి తీసుకురావాలని డిమాండ్ చేశారు.ప్రియాంక మృతి ఘటనపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించి బాధిత కుటుంబానికి న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని కోరారు ఐజలో డాక్టర్ ప్రియాంక చౌరస్తా ఏర్పాటు చేయాలిడాక్టర్ ప్రియాంక జ్ఞాపకార్థం ఐజ మండలంలోని పాత బస్టాండ్ చౌరస్తాకు డాక్టర్ ప్రియాంక చౌరస్తా గా నామకరణం చేయాలని మొరుగు వీరేష్ డిమాండ్ చేశారు. ప్రియాంక కుటుంబానికి ఆమెను ప్రేమించే ప్రజలకు ఇది ఒక శాశ్వత జ్ఞాపకంగా నిలుస్తుందని అన్నారు.డ్రగ్స్, మద్యం వినియోగంపై కఠిన చర్యలు అవసరంయువతను మాదకద్రవ్యాలు, మద్యం వంటి వ్యసనాల నుంచి దూరంగా ఉంచేందుకు డు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు కఠిన చర్యలు చేపట్టాలని ఆయన కోరారు. డ్రగ్స్ విక్రయించే వ్యక్తులు, ముఠాలపై ప్రత్యేక నిఘా పెట్టి చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.యువతలో మాదకద్రవ్యాల వినియోగం పెరగకుండా విద్యాసంస్థలు పోలీస్ శాఖ తల్లిదండ్రులు ప్రజాసంఘాలు సమన్వయంతో పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు. పిల్లలపై తల్లిదండ్రులు ప్రత్యేక నిఘా ఉంచాలితల్లిదండ్రులు కేవలం సంపాదనపైనే దృష్టి పెట్టకుండా తమ పిల్లల స్నేహాలు ప్రవర్తన అలవాట్లు వారి దైనందిన కార్యకలాపాలను కూడా గమనించాలని మొరుగు వీరేష్ సూచించారు. పిల్లలతో స్నేహపూర్వకంగా మాట్లాడి సమస్యలను తెలుసుకునే విధంగా తల్లిదండ్రులు వ్యవహరించాలని కోరారు చిన్న వయసులోనే మద్యం డ్రగ్స్, ప్రమాదకరమైన అలవాట్లకు యువత బానిస కాకుండా కుటుంబం విద్యాసంస్థలు సమాజం కలిసి బాధ్యత వహించాలని అన్నారు.అంబేద్కర్ చౌరస్తాలో కొవ్వొత్తుల ర్యాలీ అఖిలపక్ష సమావేశం అనంతరం డాక్టర్ ప్రియాంకకు నివాళులర్పిస్తూ ఐజ అంబేద్కర్ చౌరస్తా వరకు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ర్యాలీలో వివిధ రాజకీయ పార్టీలు ప్రజాసంఘాలు కుల సంఘాలు సామాజిక సంఘాల నాయకులు ఉపాధ్యాయులు విద్యార్థులు స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రియాంకకు నివాళులర్పించారుఈ సందర్భంగా డాక్టర్ ప్రియాంకకు న్యాయం చేయాలి బాధ్యులను కఠినంగా శిక్షించాలి మహిళలు విద్యార్థినుల భద్రతకు ప్రభుత్వాలు ప్రత్యేక చర్యలు చేపట్టాలి అంటూ నినాదాలు చేశారుఈ కార్యక్రమంలో అఖిలపక్ష కమిటీ జిల్లా అధ్యక్షుడు నాగరదొడ్డి వెంకట్రాములు విజయ్ భాస్కర్ రెడ్డి కురవ పల్లయ్య యంఅర్ పి యస్ నాయకుడు ఆంజనేయులు ఉపాధ్యాయులు జగపతి రెడ్డి తిమ్మప్ప, కృష్ణతో పాటు వివిధ రాజకీయ పార్టీల నాయకులు ప్రజాసంఘాల ప్రతినిధులు కుల సంఘాల నాయకులు మ సామాజిక కార్యకర్తలు స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. డాక్టర్ ప్రియాంక మృతి ఘటనపై నిష్పక్షపాతంగా వేగవంతంగా దర్యాప్తు జరిపి వాస్తవాలను వెలుగులోకి తీసుకురావడంతో పాటు బాధిత కుటుంబానికి న్యాయం జరిగే వరకు ప్రజా ఉద్యమాన్ని కొనసాగిస్తామని మొరుగు వీరేష్ స్పష్టం చేశారు