
జనం న్యూస్ ; 3 జూన్ బుధవారం: సిద్దిపేట నియోజిక వర్గ ఇన్చార్జి వై.రమేష్:సిద్దిపేట జిల్లా డీఈఓగా విశేష సేవలు అందించి పదవీ విరమణ పొందిన ఎల్లంకి శ్రీనివాస్ రెడ్డిని ఆయన చిరకాల మిత్రుడు, జగిత్యాల ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల మాజీ గెజిటెడ్ హెడ్మాస్టర్ గడ్డం బాలకిషన్ శాలువాతో ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. 1989లో ప్రారంభమైన వీరి స్నేహబంధం నేటికీ కొనసాగుతుండడం విశేషం. ఈ సందర్భంగా శ్రీనివాస్ రెడ్డి అందించిన సహకారం, ప్రోత్సాహానికి గడ్డం బాలకిషన్ కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో విద్యాశాఖ అధికారులు, ఉపాధ్యాయులు, బంధుమిత్రులు పాల్గొన్నారు.