
జనం న్యూస్ జూన్ 25 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలంలోని గోవిందా పురం గ్రామ శివారులో ఉన్న కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయంలో స్పెషల్ ఆఫీసర్ యం. మాధవి అధ్యక్షతనలో ముఖ్య అతిథిగా ఎస్సై జక్కుల పరమేశ్వర్ హాజరై విద్యార్థులకు ఇగాల్ ఫోర్స్ తెలంగాణ ఇంటర్ నేషనల్ డే అగానెస్ట్ డ్రగ్ అబ్యూడు అండ్ ఇల్లిసిట్ ట్రాపికింగ్" కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా ఎస్సై విద్యారులకు అవగాహన కల్పిస్తూ ప్రస్తుత సమాజంలో మనం ఎదుర్కుంటున్న సమస్యలు 3రకాలు అని తెలిపారు 1) సైబర్ క్రైమ్2) డ్రగ్ అబ్యూజ్3) నోషల్ మీడియా యూసేజ్కాబట్టి విద్యారులు పై విషయాల పట్ల అవగాహన కల్గి ఉండాలని, వాటి బారిన పడకుండా సెల్ఫ్ కంట్రోల్ కల్గి ఉండాలని తెలియజేశారు అనంతరం విద్యార్థులకు వ్యాసరచన, వకృత్వము, డ్రాయింగ్ పోటీలు నిర్వహించారు ఇందులో గెలుపొందిన విద్యార్థులకు ఎస్సై పరమేశ్వర్ చేతుల మీందుగా బహుమతులు బహుకరించారు. ఈ కార్యక్రమంలో కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం టీచర్లు బి. అన్న పూర్ణ, ఎ. స్వప్న, జీ. చైతన్య, వి.కవిత,. పాల్గొన్నారు....