
జనం న్యూస్ జూలై 22 (ముమ్మిడివరం ప్రతినిధి) కాంగ్రెస్ వైఖరికి నిరసనగా విజయవాడలో బిజెపి భారీ ర్యాలీప్రధానమంత్రి నరేంద్ర మోదీ నివాసం వద్ద కాంగ్రెస్ పార్టీ చేపట్టిన హింసాత్మక ధర్నాను తీవ్రంగా ఖండిస్తూ బిజెపి రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ ఆధ్వర్యంలో విజయవాడలో బిజెపి శ్రేణులు భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు.విజయ టాకీస్ నుంచి ఆంధ్రరత్న భవన్లోని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యాలయం వరకు సాగిన ఈ ర్యాలీలో బిజెపి నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని కాంగ్రెస్ పార్టీ తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.కాంగ్రెస్ వైఖరిపై ధ్వజంఈ సందర్భంగా పివిఎన్ మాధవ్ మాట్లాడుతూ, అన్ని బొద్దింకల కంటే పెద్ద బొద్దింక రాహుల్ గాంధీ అని విమర్శించారు. నీట్ పరీక్షలో అక్రమాలపై కేంద్ర ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకుని పరీక్షను రద్దు చేయడంతో పాటు విచారణ చేపట్టి బాధ్యులపై చర్యలు తీసు కుందన్నారు. నిజమైన పరీక్ష బాధితుల పట్ల బిజెపికి పూర్తి సానుభూతి ఉందని, అయితే ఈ అంశాన్ని రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకునే కాంగ్రెస్ వైఖరిని ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. అలాగే ప్రజాస్వామ్య వ్యవస్థలను లక్ష్యంగా చేసుకునే ఏ ప్రయత్నాన్నైనా బిజెపి తీవ్రంగా వ్యతిరేకిస్తుందని స్పష్టం చేశారు.నాయకుల భాగస్వామ్యం
ఈ కార్యక్రమంలో బిజెపి గుంటూరు జిల్లా ఇంఛార్జి యళ్ల దొరబాబు తదితర ముఖ్య నాయకులు, జిల్లాల ఇంఛార్జీలు, భారీ సంఖ్యలో కార్యకర్తలు పాల్గొని కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.భారీ పోలీస్ బందోబస్తు బిజెపి ర్యాలీ, ముట్టడి నేపథ్యంలో ఆంధ్ర రత్న భవన్ వద్ద పోలీసులు భారీగా మోహరించి పరిస్థితిని సమీక్షించారు.మొత్తానికి కేంద్ర నాయకత్వం పై కాంగ్రెస్ చేపడుతున్న చర్యలకు నిరసనగా బిజెపి శ్రేణులు చేపట్టిన ఈ ర్యాలీ, ముట్టడితో విజయవాడ రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది.