
జనం న్యూస్. తర్లుపాడు మండలం. ఆగస్టు. 18 తర్లుపాడు మండల కేంద్రమైన తర్లుపాడు గ్రామంలోని మండల పరిషత్ కార్యాలయ ప్రాంగణంలో నూతనంగా నిర్మించనున్న సీసీ రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి డిప్యూటీ ఎంపీడీఓ గొట్టిపాటి రాఘవరావు,పంచాయితీ రాజ్ ఏ ఈ మహంకాలయ్య ఎంపీటీసీ వన్నెబోయిన అంకమ్మ, మాజీ సర్పంచ్ పల్లెపోగు వరాలు హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించి, శంకుస్థాపన చేశారు.ఈ సందర్భంగా ప్రజాప్రతినిధులు మాట్లాడుతూ, మండల పరిషత్ నిధులతో ఎంపీపీ సూరెడ్డి భూలక్ష్మి-సుబ్బారెడ్డి పర్యవేక్షణలో తర్లుపాడు గ్రామంలో రెండు విధుల్లో సీసీ రోడ్ల నిర్మాణం చేపట్టనున్నట్లు వెల్లడించారు. అభివృద్ధి పనులను నాణ్యతా ప్రమాణాలతో, నిర్ణీత గడువులోగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తామని తెలిపారు. గ్రామాల్లో రోడ్ల సౌకర్యాన్ని మెరుగుపరిచి, ప్రజల రాకపోకల కష్టాలను తీర్చడమే లక్ష్యంగా పాలకవర్గం కృషి చేస్తోందని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు, నాయకులు మరియు గ్రామస్థులు పాల్గొన్నారు.