
జనం న్యూస్. తర్లుపాడు మండలం. ఆగస్టు 5తర్లుపాడు మండలం తర్లుపాడు నాగేళ్లముడుపు గ్రామాలలో ప్రపంచ తల్లిపాల వారోత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సూపర్ వైజర్ లక్ష్మి మాట్లాడుతూ తల్లిపాల ప్రాముఖ్యత, శిశువుల ఆరోగ్యానికి తల్లిపాలు అందించే ప్రయోజనాలపై గర్భిణులు, బాలింతలు మరియు చిన్నారుల తల్లులకు అవగాహన కల్పించారు.ఈ అవగాహన కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్లు మాలకొండమ్మ,నాసరమ్మా, అచ్చమ్మ ఆశా కార్యకర్తలు, గర్భిణులు, బాలింతలు, చిన్నారుల తల్లులు పాల్గొని తల్లిపాల ప్రాముఖ్యతపై అవగాహన పెంపొందించుకున్నారు.