
జనం న్యూస్ -ఆగస్టు 3- నాగార్జునసాగర్ టౌన్- కాన్పు కాగానే తల్లి నుండి వచ్చే మొదటి పసుపు రంగు చిక్కటి పాలు బిడ్డలకు అమృతం లాంటివి అని అర్బన్ ఫ్యామిలీ వెల్ఫేర్ సెంటర్ ( యు ఎఫ్ డబ్ల్యు సి )హెల్త్ సూపర్వైజర్ కమలమ్మ అన్నారు. తల్లిపాల వారోత్సవాల్లో భాగంగా సోమవారం నందికొండ మున్సిపాలిటీ నాగార్జునసాగర్ లోని పైలన్ కాలనీ 5వ, 6వ, 9వ అంగన్వాడీ కేంద్రాలలో గర్భిణీ స్త్రీలు, బాలింతలకు తల్లిపాలపై ప్రాముఖ్యతపై అవగాహన సమావేశాలు నిర్వహించారు. ఈ సందర్భంగా హెల్త్ సూపర్వైజర్ కమలమ్మ మాట్లాడుతూ పుట్టిన బిడ్డకు ఆరు నెలల వరకు తల్లిపాలు తప్ప మరేమీ ఇవ్వకూడదని, తల్లి అనారోగ్యంగా ఉన్నా కూడా బిడ్డకు పాలు పట్టవచ్చునని తెలిపారు. పిల్లలకు పాలు ఇవ్వడం ద్వారా తల్లులకు వచ్చే గర్భాశయ ముఖద్వారా క్యాన్సర్ ను అరికట్టే అవకాశం ఉందన్నారు. అంతే కాకుండా పుట్టిన బిడ్డకు తల్లి స్పర్శ ఎంతో ముఖ్యమని అది బిడ్డ ఎదుగుదలకు ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో హెల్త్ అసిస్టెంట్లు గంగాబాయి, లింగయ్య, తిరుమల చారి, అంగన్వాడి టీచర్లు పుష్ప, పర్వీన్,నయీమున్నీసా, గర్భిణీ స్త్రీలు, బాలింతలు పాల్గొన్నారు.