
జనం న్యూస్ సెప్టెంబర్ 11 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలం అధికారికంగా తెలంగాణ విమోచన దినోత్సవంగా జరిపించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ మండల తహసీల్దార్ కార్యాలయంలో నాయబ్ తహసీల్దార్ కి బీ జె పి మండల అధ్యక్షుడు నరహరిశెట్టి రామకృష్ణ ఆధ్వర్యంలో వినతిపత్రం అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మాట్లాడుతూ 1948 సెప్టెంబర్ 17 తెలంగాణ చరిత్రలో మరువలేని రోజు. నిజాం నిరంకుశ పాలన, రజాకార్ల దురాగతాల నుండి హైదరాబాద్ సంస్థానం విముక్తి పొంది భారతదేశంలో విలీనమైన చారిత్రక ఘట్టం. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే సెప్టెంబర్ 17ను అధికారికంగా విమోచన దినోత్సవంగా జరిపించి, సప్త సంకల్పాలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ డిమాండ్ ల వివాహాలు తెలిపారు సెప్టెంబర్ 17ను అధికారిక విమోచన దినోత్సవంగా జరిపించాలి.అమరవీరుల కుటుంబాలను గుర్తించి గౌరవించాలి.హైదరాబాద్ లో విమోచన మ్యూజియం ఏర్పాటు చేయాలి. విమోచన దినోత్సవాన్ని ప్రజా ఉత్సవంగా జరిపించాలి.పాఠ్యపుస్తకాల్లో విమోచన చరిత్రను చేర్చాలి.రజాకార్ల దురాగతాలకు గురైన గ్రామాల్లో స్మారక స్తూపాలు నిర్మించాలి.విమోచన పర్యాటక సర్క్యూట్ అభివృద్ధి చేయాలి. అని తెలియజేశారు ఈ కార్యక్రమంలో జిల్లా కార్మిక విభాగం కన్వీనర్ ఉప్పురాజు, మండల ప్రధాన కార్యదర్శి భూతం తిరుపతి, సీనియర్ నాయకులు బాసని విద్యాసాగర్, వనం దేవరాజ్, మండల ఉపాధ్యక్షులు కోమటి రాజశేఖర్, భూత అధ్యక్షులు కన్నబోయిన రమేష్, ముల్కనూరి వెంకటేష్, తదితరులు పాల్గొన్నారు.....