
కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కు ఎమ్మెల్యే సోము వీర్రాజు వినతి
జనం న్యూస్ జూలై 31 (ప్రతినిధి గ్రంధి నానాజీ) తాటి ఉత్పత్తులపై ఆధారపడి జీవిస్తున్న కుటుంబాలు కల్లు గీత కార్మికుల సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకోవాలని న్యూఢిల్లీలో కేంద్ర వ్యవసాయ రైతుల సంక్షేమ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ను బీజేపీ ఎమ్మెల్యే సోము వీర్రాజు కోరారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా లక్షలాది కుటుంబాలు తాటి ఆధారిత ఉత్పత్తులపై ఆధారపడి జీవిస్తున్నారు. అయితే వారికి సరైన మార్కెటింగ్ సౌకర్యాలు, ప్రోత్సాహకాలు లేకపోవడంతో వారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తాటి బోర్డు ఏర్పాటు చేయాలని అంతర్జాతీయ మార్కెటింగ్ (తాటి బెల్లం, తాటి కలకండ, నీరా వంటి ) ఉత్పత్తులకు దేశ, విదేశాల్లో గుర్తింపు, బ్రాండింగ్ కల్పించాలని తాటి ఆధారిత పరిశ్రమల ప్రోత్సాహం (గ్రామీణ ప్రాంతాల్లో చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు రాయితీలు, రుణ సౌకర్యాలు ఇవ్వాలని ఉపాధి అవకాశాల విస్తరణయువతకు శిక్షణ ఇచ్చి, తాటి ఉత్పత్తుల విలువ ఆధారిత పరిశ్రమలను పెంచాలనే నాలుగు ప్రధాన డిమాండ్లతో వినతిపత్రం అందచేశానన్నారు. ఈ విషయం పై కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించారని, త్వరలో తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారని "తాటి రైతుల, గీత కార్మికుల భవిష్యత్తు కోసం నా వంతు నిరంతరం కృషి చేస్తాను. వారికి అండగా ఉండటమే మన లక్ష్యమని సోము వీర్రాజు తెలిపారు.