
జనం న్యూస్ ఆగస్టు 28: నిజామాబాద్ జిల్లా ఏర్గట్ల మండలంలోని తాళ్ల రాంపూర్ గ్రామంలో ప్లాస్టిక్ కవర్ల వినియోగాన్ని పూర్తిగా నిషేధించాలని గ్రామపంచాయతీ, దేవాదాయ కమిటీ నిర్ణయించింది. ఇందులో భాగంగా నిషేధానికి సంబంధించిన నోటీసులను ఈరోజు గ్రామంలోని వ్యాపారులకు అందజేశారు.సెప్టెంబర్ 1వ తేదీ నుంచి గ్రామంలో ప్లాస్టిక్ కవర్లను పూర్తిగా నిషేధించనున్నట్లు నోటీసుల్లో పేర్కొన్నారు. ఇప్పటికే ఉన్న పాత ప్లాస్టిక్ కవర్లను మాత్రం సెప్టెంబర్ 1వ తేదీ వరకు వినియోగించుకోవచ్చని, ఆ తర్వాత వాటిని ఉపయోగించరాదని స్పష్టం చేశారు.ప్లాస్టిక్ వినియోగం వల్ల పర్యావరణానికి కలుగుతున్న నష్టాలను దృష్టిలో ఉంచుకొని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. గ్రామ ప్రజలు, వ్యాపారులు నిషేధానికి సహకరించి ప్లాస్టిక్ రహిత గ్రామంగా తీర్చిదిద్దేందుకు సహకరించాలని కోరారు.ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ మరియు ఇంచార్జీ సర్పంచ్ చాట్ల జనార్ధన్, పంచాయతీ కార్యదర్శి బి. ప్రశాంత్, కారోబార్ సాయిరాం, అధ్యక్షుడు భీమనవోయిన పెద్ద బావులు, రాజారం శంకర్ గ్రామ ప్రజలు పాల్గొన్నారు.