
జనం న్యూస్ ఆగస్ట్ 19 తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి నేరాల నియంత్రణ, విజిబుల్ పోలీసింగ్ పై ప్రత్యేక దృష్టి.
కేసుల దర్యాప్తు, నేరాల చేదనలో సాంకేతికత వినియోగం.నేరాలకు పాల్పడితే ఎంతటివారైనా చట్టానికి చిక్కక తప్పదు.సమస్యాత్మక గ్రామాల్లో, రౌడీషీటర్ల, హిస్టరీషీటర్లపై నిరంతరం నిఘా.నిరంతర తనికి, డయల్ 112, ఇంటివద్ద నుండి కేసులు లాంటి వాటితో పోలీసు సేవలు విస్తృతం చేశాం.. సూర్యాపేట జిల్లా ఎస్పీ నరసింహ ఐపీఎస్ వార్షిక తనిఖీల్లో భాగంగా ఈ రోజు తుంగతుర్తి సర్కిల్ కార్యాలయాన్ని ఎస్పీ నరసింహ ఐపీఎస్ సందర్శించి రికార్డ్స్ ను, పరిసరాలను తనిఖీ చేశారు. సర్కిల్ కార్యాలయానికి సంబంధించిన సర్కిల్ ఇన్ఫర్మేషన్ క్రైం రికార్డు ప్రాపర్టీ రిజిస్టర్, పిటిషన్ రిజిస్టర్ లను పరిశీలించారు. సర్కిల్ పరిధిలో ఉన్న తుంగతుర్తి, మద్దిరాల, నూతనకల్ పోలీస్ స్టేషన్ ల పరిధిలో నమోదవుతున్న కేసులు, దర్యాప్తులో ఉన్న కేసులు, పెండింగ్ ట్రయల్ కేసులకు సంబంధించిన సీడీ ఫైళ్లను పరిశీలించారు.