
జనం న్యూస్ 26 ఆగస్టు 2026 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్ జోగుళాంబ గద్వాల జిల్లా అలంపూర్ నియోజకవర్గం ఐజ మండలం బస్సు సౌకర్యం కోసం కృషి చేసిన 6వ వార్డు గౌరవ కౌన్సిలర్ మహేశ్వరి వెంకన్న గౌడ్ కి ప్రత్యేక ధన్యవాదాలు తుపత్రాల గ్రామానికి చెందిన 8, 9, 10 తరగతుల విద్యార్థులు విద్యనభ్యసించడానికి ప్రతిరోజూ ఉత్తనూర్ జెడ్పీహెచ్ఎస్ పాఠశాలకు వెళ్లాలంటే రానుపోను 6 కిలోమీటర్లు కాలినడకన సాగవలసి వచ్చేది. సుదూర ప్రయాణం, రోజూ నడక వల్ల కలిగే ఇబ్బందులు, భద్రతాపరమైన సమస్యలను దృష్టిలో ఉంచుకుని విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. విద్యార్థుల ఈ దీర్ఘకాలిక సమస్యను గుర్తించిన గౌరవ కౌన్సిలర్ మహేశ్వరి వెంకన్న గౌడ్ దీనిపై ప్రత్యేక చొరవ తీసుకున్నారు. విద్యార్థుల విన్నపాన్ని మన్నించి, కలెక్టర్ కి మరియు ఆర్టీసీ డీఎం దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లి బస్సు సౌకర్యం కల్పించేలా అహర్నిశలు కృషి చేశారు. వారి కృషితో గత 15 రోజులుగా విద్యార్థుల కోసం నిత్యం ఉదయం మరియు సాయంత్రం వేళల్లో ఉత్తనూర్ గ్రామం మీదుగా ఆర్టీసీ బస్సు విజయవంతంగా నడుస్తోంది. ఇప్పుడు మా విద్యార్థులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సంతోషంగా బస్సులో బడికి వెళ్తున్నారు ఈ బృహత్తర కార్యానికి పూర్తిస్థాయిలో స్పందించి బస్సు సౌకర్యం కల్పించిన గౌరవ ఆర్టీసీ అధికారులకు, ఈ సమస్య పరిష్కారానికి నిరంతరం శ్రమించిన గౌరవ కౌన్సిలర్ మహేశ్వరి వెంకన్న గౌడ్ కి మరియు ఈ ప్రయాణానికి సహకరించిన ప్రతి ఒక్క పెద్దలకూ తుపత్రాల గ్రామ ప్రజల విద్యార్థులు మరియు తల్లిదండ్రుల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు