
జనం న్యూస్ జూన్ 27 తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి : తెలంగాణ తొలి మలిదశ ఉద్యమకారుడు దివంగత నేత గొట్టిముక్కల పద్మారావు కుటుంబ సభ్యులను తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత పరామర్శించారు. ఈ సందర్భంగా పద్మారావు చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో కూకట్పల్లి ప్రాంతం నుండి గొట్టిముక్కల పద్మారావు తన వంతు కృషి చేశారని కొనియాడారు. పద్మారావు ఆకస్మిక మరణం తీరనిలోటని కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ మనోధైర్యాన్ని ఇచ్చారు. ఈ కార్యక్రమంలో వట్టిముక్కల పాండురంగారావు, కుట్టిముక్కల వెంకటేశ్వరరావు, సృజన, బీసీ సంఘర్షణ సమితి రాష్ట్ర ఉపాధ్యక్షులు అంబల మహేష్ గౌడ్, మేకల సుదర్శన్, ఈ సునీల్ రెడ్డి, విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.