
జనం న్యూస్ జులై 7 చిలిపి చెడు మండల ప్రతినిధి మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గంలో మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి.-సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు కడారి నాగరాజు మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ యూనియన్( సిఐటియు ) ఆధ్వర్యంలో మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కారం చేయాలనీ మంగళవారం కమిషనర్ సాయి కుమార్ కు వినతిపత్రం అందచేశారు. ఈ సందర్బంగా సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు కడారి నాగరాజు మాట్లాడుతూ మున్సిపల్ లో పనిచేస్తున్న కార్మికులందరికీ పర్మినెంట్ చేయాలని రెండో పిఆర్సి అమలు చేసి పెరుగుతున్న ధరలకు అనుగుణంగా 26,000 వేతనం ఇవ్వాలని కార్మికులందరికీ రిటైర్మెంట్ బెనిఫిట్స్ కల్పించి హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలని మున్సిపల్ పరిధిలో పనిచేసే కార్మికులందరికీ ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలని తదితర సమస్యలు పరిష్కరించాలని ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వము మున్సిపల్ కార్మికుల యొక్క సమస్యలు పరిష్కరించడానికి కృషి చేయాలని లేని ఎడలో రాష్ట్ర వ్యాప్తంగా సమ్మె చేయడానికి సిద్ధంగా ఉన్నామని ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నామన్నారు. వర్షాకాల సమయంలో కార్మికులకు కనీస సౌకర్యాలు వెంటనే కల్పించాలని డిమాండ్ చేసారు.ఈ కార్యక్రమంలో తెలంగాణ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ యూనియన్( సీఐటీయూ) జిల్లా అధ్యక్షులు పుష్ప ,యూనియన్ అధ్యక్షులు రాములు నాయకులు శంకర్, అశోక్, అనిత, జ్యోతి, సంగీత, ఎల్లం తదితరులు పాల్గొన్నారు